తెలంగాణ

America : అమెరికాలో నిర్మల్ యువకుడు దుర్మరణం

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఉన్నత చదువులు, ఎన్నో ఆశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయుల కల చెదిరిపోతున్నది. ఇటీవలి కాలంలో భారతీయులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా?

ఉన్నత చదువులు, ఎన్నో ఆశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయుల కల చెదిరిపోతున్నది. ఇటీవలి కాలంలో భారతీయులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా దీని వెనుక ఏదైనా కుట్రకోణం దాగున్నదా? అనేది తెలియాల్సి ఉన్నది. అమెరికాలో ఈ మధ్య ఇండియన్స్ పట్ల వ్యతిరేకత పెరిగిపోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇండియన్స్ కారణంగా తమ ఉద్యోగాలు పోతున్నాయని, స్థానికులకు నష్టం జరుగుతోందని కొందరు జాతివివక్షకు పాల్పడుతున్నట్టు ఆ వీడియోల్లోని సారంశం.

ప్రమాదాల సంగతి పక్కన బెడితే కేవలం ఇండియన్స్ పనిచేస్తున్న చోట వారికి రక్షణ కరువైంది. కత్తులతో దాడులు, తుపాకీతో కాల్చి పారిపోవడాలు పెరిగిపోయాయి.ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. అసలు దీని వెనుక ఏం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతుండగా..అమెరికాకు తమ పిల్లలను పంపించేందుకు పేరెంట్స్ సైతం జంకుతున్నారు.

https://x.com/TeluguScribe/status/2080512991464923408?s=20

ఇదిలాఉండగా, తాజాగా అమెరికాలో నివసిస్తున్న తెలంగాణలోని నిర్మల్ జిల్లా వాసి ప్రమాదంలో మరణించాడు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానందర్ రెడ్డి (26) చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందినట్టు సమాచారం. మృతుడు MS పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అతనిది నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌కి స్వస్థలం. గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో స్నేహితులు చేర్పించగా.. చికిత్స పొందుతూ నిన్న మరణించాడు.కాగా, నిత్యానందరెడ్డి మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని పేరెంట్స్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

#Nirmal personal#dead#accident#america
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి