టాప్ న్యూస్

బాలకృష్ణకు సర్జరీ సక్సెస్.. ఏఐజీలో మూడు గంటల పాటు ఆపరేషన్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నగరంలోని ప్రముఖ ఏఐజీ(AIG) ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు.

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నగరంలోని ప్రముఖ ఏఐజీ(AIG) ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందోని, వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు అధికారికంగా వెల్లడించారు.

ఇటీవల ఓ భారీ యాక్షన్ సినిమా షూటింగ్ వ్యవధిలో బాలకృష్ణ ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. మోకాలి భాగంలో రక్తం గడ్డకట్టడంతో పాటు తీవ్రమైన వాపు రావడంతో వెంటనే పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మోకాలి కండరాలలో చిన్నపాటి చీలిక(Tear) ఏర్పడినట్లు నిర్ధారణ కావడంతో, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే శస్త్రచికిత్స చేయడమే సరైన పరిష్కారమని వైద్యులు స్పష్టం చేశారు.వైద్యుల సలహా మేరకు గురువారం సాయంత్రం ఆసుపత్రిలో చేరిన బాలకృష్ణకు, శుక్రవారం ఉదయమే వైద్య బృందం సర్జరీ ప్రక్రియను పూర్తి చేసింది.

ప్రస్తుతం ఆయన ప్రత్యేక వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిపుణులైన డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా, మరికొద్ది రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు సర్జరీ జరిగిందనే వార్త తెలిసిన వెంటనే సినీ లోకం, రాజకీయ వర్గాలు తీవ్ర ఆందోళన చెందాయి. ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ పూర్తి ఆరోగ్యంతో షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు, తోటి నటులు, నేతలు సోషల్ మీడియా వేదికగా 'గెట్ వెల్ సూన్' అంటూ ఆకాంక్షిస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో 111వ చిత్రంలో (NBK111) నటిస్తున్నారు. 'వీరసింహారెడ్డి' లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు కాకినాడ పోర్ట్ వ్యాప్తంగా వేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది డిసెంబర్ (2026) క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

#Balakrishna Knee Surgery#NBK111 Updates#Gopichand Malineni#Nandamuri Balakrishna#AIG Hospitals Hyderabad#Balakrishna Health Status#NBK111 Release Date#Tollywood News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి