International

America: ప్రపంచ దేశాలకు షాకిచ్చిన అమెరికా!.. భారత్‌కు స్వల్ప ఊరట..

రచన: Venu5 నిమిషాల పఠనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ప్రపంచ దేశాలకు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే యుద్ధ వాతావరణం.. ఆర్థిక అనిశ్చితి.. పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను కలిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ప్రపంచ దేశాలకు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే యుద్ధ వాతావరణం.. ఆర్థిక అనిశ్చితి.. పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను కలిస్తున్నాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో.. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 60 దేశాలపై కొత్త టారిఫ్‌లను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వెట్టి చాకిరీ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో ఆయా దేశాలు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలతో.. అమెరికా ఈ కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చింది.

ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 కింద ఈ టారిఫ్‌లు విధించారు. తాత్కాలికంగా అమలులో ఉన్న 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ల గడువు ముగియడంతో.. ఇప్పుడు 60 భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ చర్యతో ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ వ్యవహారంలో భారత్‌కు మాత్రం స్వల్ప ఊరట లభించింది. తొలుత భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించిన.. చివరకు టారిఫ్‌ను 10 శాతానికి పరిమితం చేసింది. అంటే.. అమెరికా విధించిన సుంకాల నుంచి భారత్ పూర్తిగా తప్పించుకోకపోయినా.. ఇతర దేశాలతో పోలిస్తే కొంత తక్కువ భారాన్ని ఎదుర్కోనుంది. అయితే ఇది కేవలం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదని.. ట్రంప్ విదేశాంగ, ఆర్థిక విధానాల్లో కనిపిస్తున్న కొత్త ధోరణికి మరో ఉదాహరణగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. చమురు సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలు పెరిగితే.. రవాణా నుంచి పరిశ్రమల వరకు.. ప్రతి రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా మిత్రదేశాలు, వాణిజ్య భాగస్వాములపై కూడా కొత్త టారిఫ్‌లు విధించడం.. ప్రపంచ మార్కెట్లలో మరింత అనిశ్చితిని పెంచుతోంది.

టారిఫ్‌ల పేరుతో ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు అమెరికా ప్రయోజనాల కోసం తీసుకుంటున్నవేనని ఆయన ప్రభుత్వం చెబుతోంది. కానీ మరోవైపు.. ఈ సుంకాల భారాన్ని చివరికి అమెరికా వినియోగదారులు, దిగుమతిదారులు, ప్రపంచ సరఫరా గొలుసులే మోయాల్సి వస్తుందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు యుద్ధాలు.. మరోవైపు టారిఫ్‌ల యుద్ధం.. ఇంకోవైపు పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి.. ఈ మూడు పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి ప్రభావం పడునుందో అనే ఆందోళన రేకెత్తిస్తుంది.

భారత్‌కు 12.5 శాతం బదులు 10 శాతం టారిఫ్‌తో స్వల్ప ఊరట లభించినా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి వరుస నిర్ణయాలు ఎటువైపు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. యుద్ధ వాతావరణం మధ్య.. ఇప్పుడు టారిఫ్‌లతో కొత్త ఆర్థిక పోరాటానికి తెరలేపారా? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.

#National#America#trump#India#tariffs 60 countries#shock
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి