తెలంగాణ

Hyderabad : ప్రశ్నిస్తే యాంటి నేషనల్ అవుతారా? :నిరసనకారులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

నేడు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.

నేడు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ప్రస్తుతం నిరసనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే పలువురు విద్యార్థినులు మీడియాతో ముచ్చటించారు. వారి ఆవేదను వెల్లిబుచ్చారు.

ఓ యువతి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అవుతారా? లాఠీ‌ఛార్జ్ పేరిట బీజేపీ ప్రభుత్వం గూండాగిరి చేస్తుంది, గూండాలను పోలీస్ వేషంలో పంపి విద్యార్థులపై దాడులు చేయిస్తుంది.విద్యావ్యవస్థ బాగుపడాలని పోరాడితే తప్పేంటి? కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పు జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటాం. దమ్ముంటే బీజేపీ మంత్రులను NEET పరీక్ష రాయమనండి, అప్పుడు మా బాధ అర్థమవుతుంది’ అని సవాల్ విసిరింది.

https://x.com/TeluguScribe/status/2080508229805871501?s=20

మరో విద్యార్థిని సైతం మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, యూట్యూబర్లే మా బాధ అర్థం చేసుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు మా బాధను పట్టించుకోవడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు. ఢిల్లీలో విద్యార్థినిలపై పోలీసుల దౌర్జన్యం చూస్తే కంట్లో నీళ్లు తిరిగాయి. బయట నుండి ఫండింగ్ రావడం కాదు మేమే మా సొంత డబ్బులతో జంతర్ మంతర్ దగ్గరికి ఆహారం పంపిస్తున్నాం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా, నేడు ఇందిరాపార్క్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం సైతం నిరసనలకు పిలుపునిచ్చింది.

#hyderabad#NEET#Protests#Telanganaa#central minister resignation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి