తెలంగాణ

Kaleshwaram : నీళ్లు ఎత్తిపోయొద్దని మేం చెప్పలేదు : ఎన్డీఎస్ఏ!

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఎల్‌ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. వర్షాలు లేక సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీంతో అన్నదాతలు అల్లాడుతున్నారు.

ఎల్‌ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. వర్షాలు లేక సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీంతో అన్నదాతలు అల్లాడుతున్నారు.ఈ క్రమంలోనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ స్పందించడం లేదు.ఎన్‌డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకుని కారణాలు చెబుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఒక ఎన్ఆర్ఐ.. ఎన్‌డీఎస్ఏకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోయవద్దని చెప్పారా? అంటూ మెయిల్ చేయగా.. ఎన్‌డీఎస్ఏ రిప్లయ్ ఇచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం నుండి నీళ్లు లిఫ్ట్ చేయకూడదని తాము చెప్పలేదని ఎన్డీఎస్‌ఏ సభ్యుడు తోతేజా రిప్లయ్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఆ మెయిల్ సారాంశం ఇలా ఉన్నది. ‘కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలా? వద్?దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.బ్యారేజీల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి.. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేదు.

అదే సమయంలో, నీటిని పంప్ చేసే ముందు బ్యారేజీల భద్రతని ప్రభుత్వం పరిశీలించాలి.సాంకేతిక నిపుణుల సూచనలు, పునరుద్ధరణ పనులను కూడా ప్రభుత్వం పర్యవేక్షించాలి. కాళేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొద్దని మేము ఎలాంటి రిపోర్టులో చెప్పలేదు’ అని పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలాఉంటే , ఈ రిపోర్టుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు.

https://x.com/TeluguScribe/status/2080269360489517459?s=20

రెండున్నరేళ్లుగా ఎన్డీఎస్‌ఏ రిపోర్టు సాకుతో కాళేశ్వరం నీళ్లు వదలకుండా రేవంత్ డ్రామా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.బ్యారేజీలు నింపవద్దని, నీళ్లు ఎత్తిపోయొద్దని ఎన్డీఎస్‌ఏ చెప్పిందంటూ అడ్డగోలుగా అబద్ధాలు అడుతున్నారని, కాళేశ్వరాన్ని పక్కనపెట్టి మేడిగడ్డ నుంచి రూ. కోట్ల విలువైన ఇసుకను ప్రభుత్వం అమ్ముకున్నదని ఆరోపించారు.

#kaleshwaram#cm revanth reddy#NDSA Report#BRS
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి