National

Salman Khan : మోడీ చూసుకుంటారు.. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోండి : సల్మాన్ ఖాన్

రచన: Kumar3 నిమిషాల పఠనం

నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల దాడులపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ఈ అంశంపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.

నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల దాడులపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ఈ అంశంపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ పోలీసుల దాడిని ఖండిస్తున్నారు. దేశభవిష్యత్ అయిన యువత పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి స్పందించారు.

ముందుగా విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపిన సల్మాన్ ఖాన్.. తాజాగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్, వారి భద్రతే కేంద్ర ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్న ఆయన.. ఆందోళనలు విరమించి ఇళ్లకు తిరిగి వెళ్లాలని విద్యార్థులు, నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.

‘విద్యార్థుల చదువు, వారి రక్షణే అత్యంత ముఖ్యం. అందుకే విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై గౌరవనీయులైన ప్రధాని ఇప్పటికే స్పందిస్తూ ట్వీట్ చేశారు. లీకేజీకి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. విద్యార్థులంతా దయచేసి ఇళ్లకు,తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలి" అని కోరారు.

అయితే, సల్మాన్ ఖాన్ ట్వీట్ పట్ల కొందరు ఆలోచిస్తుండగా.. మరికొందరు కేంద్రానికి సపోర్టు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు కేవలం టైం పాస్ కోసం నిరసనలు చేస్తూ పోలీసుల చేత దెబ్బలు తినడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు నిరసనలు విరమించేది లేదని వారంతా స్పష్టంచేస్తున్నారు.

#Actor Salman khan#bollywood#Neet#protests#recall to students
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి