సినిమా

Anil Ravipudi: వెంకీ-కీర్తి, కళ్యాణ్ రామ్-కృతిలతో ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్

రచన: Anshu3 నిమిషాల పఠనం

Anil Ravipudi: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి మాట్లాడుకునే వారు. అది ఏ విషయంలో అంటే సినిమాను ఫినిష్ చేయడంలో. వారం రోజుల్లో కథ, ఇంకో వారం రోజుల్లో డైలాగులు రాసేసే పూరి, 100 రోజుల్లో సినిమాను రిలీజ్ చేసేస్తాడు. బద్రి, అమ్మా నాన్నా ఒక తమిళ అమ్మాయి, ఇడియట్, పోకిరి, బిజినెస్‌మేన్..ఇలా ఇండస్ట్రీ హిట్స్ అన్నీ అలా తీసినవే.

మేకింగ్ పరంగా పూరి తర్వాతే ఎవరైనా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పాపులారిటీ దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కింది. ఇప్పటి వరకూ ఆయన తీసింది 9 సినిమాలు. ఈ 9 సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్స్‌గా రికార్డ్స్ క్రియేట్ చేసినవే. పూరి జగన్నాధ్ మాదిరిగా మరీ 100 రోజుల్లో సినిమాను రిలీజ్ చేయలేదు గానీ, బ్లాక్ బస్టర్స్ మాత్రం పూరిని మించి అందుకున్నాడు.

అనిల్ రావిపూడి కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక, ఆయన దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా మరో సాలీడ్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. తాజాగా, ఈ క్రేజీ కాంబో మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని, తెలుపుతూ మేకర్స్, అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

అనిల్ రావిపూడి టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రమోషన్స్ గురించి అస్సలు ఆలోచించనవసరం లేదు. ఇప్పటికే, వెంకీకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఉన్నాడు. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ తో తన మొదటి సినిమా తీసి హిట్ ఇచ్చి ఉన్నాడు. గ్లామర్ బ్యూటీస్ కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ మధ్య సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు. గ్యారెంటీగా వీరందరికి అనిల్ రావిపూడి పవర్ ప్యాక్డ్ హిట్ ఇవ్వబోతున్నాడు.

#anilravipudi#venkatesh#kalyanram#keerthysuresh#krithisetty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి