ప్రపంచం

India : ఇండియాకు స్పెషల్ థ్యాంక్స్ : చైనా

రచన: Kumar4 నిమిషాల పఠనం

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం గ్లోబల్ వైడ్ వైరల్ అవుతోంది. ఎందుకంటే చైనా, ఇండియాకు సరిహద్దు భద్రతా అంశాల్లో గొడవలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా ఇప్పటికీ వాదిస్తోంది.

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం గ్లోబల్ వైడ్ వైరల్ అవుతోంది. ఎందుకంటే చైనా, ఇండియాకు సరిహద్దు భద్రతా అంశాల్లో గొడవలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా ఇప్పటికీ వాదిస్తోంది.పలుమార్లు అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దేశ చిత్రపటంలో చూపించే ప్రయత్నాలు చేసింది.అంతేకాకుండా గల్వాన్ లోయ ఘర్షణలు గురొస్తే చైనా ఆక్రమణల పర్వం మరోసారి ప్రతి భారతీయుడి నెత్తుటిని మరిగిస్తుంది. అంతేకాకుండా అక్సాయ్ చిన్ భారత భూభాగంలోని జమ్ముకాశ్మీర్ నుంచి లాగేసుకున్న ముక్క. దానిని నెహ్రూ హయాంలో చైనా ఆక్రమించిన విషయం తెలిసిందే.

దేశంలో కుట్రలకు, అశాంతిని రగిలించడం, చైనా నుంచి చాలా వరకు మనీ లెండింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ అవుతున్నాయి. దీంతో కేంద్రం ఇప్పటికే పలు చైనా మేడ్, అక్కడి నుంచే ఆపరేట్ అయ్యే వాటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దేశంలో విచ్ఛిన్నం చేయడానికి , భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి అంతర్జాతీయంగా కుట్రలు చేస్తూనే.. పాకిస్తాన్‌తో కలిసి వాణిజ్యం, సీపీక్ కారిడార్ నిర్మాణం వంటివి చేస్తున్నది. అటు పాక్, ఇటు చైనా నుంచి భారత్‌కు వివాదాలున్నాయి.

అయితే,తాజాగా చైనా.. భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇండియాలో చైనా నూతన డిఫెన్స్ అటాచ్‌గా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ యూ జియాన్ భారత నౌకాదళం అందించిన సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) 99వ వార్షికోత్సవ వేడుకల్లోఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కేరళ తీర సమీపంలో ఘోర అగ్నిప్రమాదానికి గురైన ఒక చైనా కార్గో షిప్‌లోని 12 మంది చైనీస్ నావికులను ఇండియన్ నేవీ ప్రాణాలకు తెగించి కాపాడిందని ప్రత్యేకంగా గుర్తుచేశారు.

భారత నేవీ సాయం, మానవతా దృక్పథాన్ని తామెప్పటికీ మరిచిపోలేమని, దానికి తాము ఎంతో రుణపడి ఉంటామని కొనియాడారు. సముద్ర భద్రతతో పాటు ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో ఈ రకమైన సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లోనూ మిలిటరీ, దౌత్యపరమైన అంశాల్లో ఇండియాతో కలసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంటుందని అడ్మిరల్ యూ జియాన్ తెలిపారు.

#china#special thanks#india#indian navy#international affairs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి