నేడు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురానున్నారు? కేంద్రమంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పిస్తారా? ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉన్నది.
దీనిపై నిన్న రాత్రి ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు. మరోవైపు చర్చల కోసం కేంద్రమంత్రులు సీజేపీ పార్టీకి ఆఫర్ చేయగా..వాళ్లు సైతం చర్చలకు అంగీకరించినట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. పోలీసులు దాడి చేయడంపై బీజేపీ కో ఫౌండర్, మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత మురళిమనోహర్ జోషి స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన హ్యాండిల్ నుంచి ట్వీట్ వైరల్ అవుతోంది.
‘ఢిల్లీలో విద్యార్థులను కొట్టి లాఠీచార్జ్ చేయడం ఆవేదన కలిగించింది. విద్యా వ్యవస్థ పట్ల వారిది నిజమైన ఆవేదన. వారి ఆవేదనను సానుభూతితో పరిష్కరించాలి. దీనిని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసి వారిపై కఠినంగా వ్యవహరించడం సరికాదు’ అని పేర్కొన్నారు.కాగా, డా.మురళీ మనోహర్ జోషి 1980 నుంచి ఇప్పటివరకు సుమారు 46 ఏండ్లుగా భారతీయ జనతా పార్టీలో (BJP) కొనసాగుతున్నారు.ఆయన బీజేపీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు.
https://x.com/TeluguScribe/status/2080343651906199906?s=20
అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఈ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. బీజేపీ అభ్యర్థిగా వారణాసి నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు ఎన్నికైయ్యాడు. ఈయన 1996 లో 13 రోజుల పాటు ప్రభుత్వానికి హోంమంత్రిగా పనిచేశాడు.2009లో బీజేపీ మేనిఫెస్టో ప్రిపరేషన్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. వారణాసి నుంచి సిట్టింగ్ ఎంపిగా ఉన్న ఈయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఆ సీటు కోసం వదులుకున్నాడు. కాగా, బీజేపీ కో ఫౌండర్ ఇలా స్పందించడం బీజేపీకి నెగెటివ్ అవుతుందని విమర్శలొస్తున్నాయి.












