మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1955లో ఏపీలోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి నేడు 71వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ అభిమాన నటుడు ఇలాగే మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆక్షాంక్షిస్తున్నారు.
చిరు కుటుంబసభ్యులు సైతం మెగాస్టార్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదిలాఉండగా, చిరంజీవి బర్త్ డే పురస్కరించుకుని నిన్న హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ జరిగింది.అందులో జబర్దస్త్ హైపర్ ఆది, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే,గత కొంతకాలంగా చిరంజీవి కుటుంబం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీలో పెత్తనమంతా ఆయనదేనని.. ఆయన ఎవరికి మద్దతుగా ఉంటారో నిర్మాతలు, డైరెక్టర్లు వారికే ఆఫర్లు ఇస్తారని తెగ ప్రచారం చేశారు.
దీనికి తోడు ఆయనకు కుల పిచ్చి కూడా ఉందని కొందరు ఆరోపించారు. కేవలం వారి కులం వారికే మద్దతు ఇస్తుంటారని, హీరోలు, పెద్దనటులను చేస్తుంటారని చాలా రూమర్లు వినిపించాయి. సాయం కోరివచ్చిన వారిని పట్టించుకోరని.. ఇండస్ట్రీ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, సినీకార్మికుల సమస్యల మీద ప్రశ్నించరని చాలా మందే విమర్శలు చేసిన వారున్నారు. అయితే,వీటన్నింటినీ చిరు ఎన్నడూ సీరియస్‌గా తీసుకోలేదని తెలిసింది.
https://x.com/TeluguScribe/status/2090892679144185858?s=20
చిరంజీవి నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆయనపై విమర్శలు చేసిన వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఫ్యామిలీని నుంచి సుమారు ఆరుగురు కంటే ఎక్కువ మందే హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ విమర్శలన్నింటీకి హైపర్ ఆది చెక్ పెట్టాడు.
‘అవును.. చిరంజీవి తొక్కేశాడు!.తెలుగు సినిమా ఇండస్ట్రీలో NO.1గా ఎవరు కంటిన్యూ కాలేరు అనే అహంకారాన్ని తొక్కేసి 30 ఏళ్లు NO.1గా ఉన్నాడు. పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్‌లోనే ఉంటాయి, అది టాలీవుడ్‌లో సాధ్యం కాదు అనే ఊహలను తొక్కేశాడు.
డ్యాన్స్ అంటే నడవడం, హీరోయిన్ చుట్టూ తిరగడం అనే భ్రమను తొక్కేశాడు. హీరోలు అంటే డబ్బులు సంపాదించుకుంటారు అనుకునే వాళ్ల రాంగ్ మైండ్‌సెట్‌ను తొక్కేశాడు. తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవడు అనే ఆలోచనలను తొక్కేసి, కొడుకును తండ్రిని మించిన హీరోగా తయారు చేశాడు’ అని హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
అదే ఈవెంటులో నిర్మాత బండ్ల గణేశ్ సైతం.. చిరంజీవి మీద వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘చిరంజీవి తొక్కుతాడు అంటున్నారు. చిరంజీవి తొక్కడు..ఎక్కుతాడు ఎక్కిస్తాడు? చిరంజీవి గొప్ప వ్యక్తిత్వం గురించి పుస్తకాలు ప్రచురించి భావితరానికి చూపించాలి’ అని పేర్కొన్నారు.
https://x.com/TeluguScribe/status/2090897997739802855?s=20


