- అసలు రైజింగ్ ఆనాటి ప్రభుత్వానిదే?
- ఇప్పుడంతా డ్రైనేజ్ వ్యవస్థనే?
- ఆనాడేమో కచరా అని ప్రచారం చేశారు
- ఇప్పుడు డ్రైనేజీ అని ఎందుకు అనొద్దు?
- స్వేచ్ఛ వద్ద ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి
- మితిమీరిన కాంగ్రెస్ నేతల చెత్త వైఖరిపై రైజింగ్ కాదు డ్రైనేజ్ ఏంటో పార్ట్ 2లో చూద్దాం
---------------
- ‘హస్త’వ్యస్థంలో రేవంత్ మార్క్ పాలిటిక్స్ స్టార్ట్?
- ఎలాగు రాలేము. కొత్తగా ఏంచేస్తే దృష్టి మరలుతుందో అని ప్లాన్?
- పరకాలలో ప్రకటన చేయాల్సిన అవసరం లేకున్నా అందుకే రెచ్చగొట్టారా?
- ఎంపీగా ఓడిన వారితో ఎఐసీసీ మీటింగ్.. అక్కడే ప్రారంభం అయిందా?
- రైజింగ్ పాలన కాస్తా, డ్రైనేజ్‌లా మార్చేసే పరిస్థితి ఎందుకొస్తోంది?
- 32 నెలలకే ముక్కులోకి వచ్చినట్లు బలాబలాలపై చర్చ ఎందుకు?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
స్వేచ్ఛ చైర్మన్
9848070809
రైజింగ్ పాలనను డ్రైనేజీలా మార్చేశారు?
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతా రైజింగ్‌యే. కానీ, బంగారు తెలంగాణ పేరుతో కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారంగా మారాయని, అప్పట్లో కేసీఆర్‌ని కచరా అన్నట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు రేవంత్ పాలనలో రైజింగ్ పేరుతో ఆనాటి రైజింగ్‌ను డ్రైనేజీగా మార్చేశారు. స్వేచ్ఛ న్యూస్ వద్ద మీ ప్రతి డ్రైనేజ్ పనికి సమాధానం ఉంది. పార్టీలో, ప్రధాన అనుచరులు అంటూ చెత్తను అంతా తీసుకొచ్చి ప్రభుత్వంపై రుద్ది గందరగోళం సృష్టించారు. 32 నెలల్లోనే పట్టు తప్పిన పాలనతో ఏగలేమని చేతులు ఎత్తేసింది నిజం కాదా? గురువారం జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ డ్రైనేజీ మాటలతో జరుగుతున్న నష్టం ఏంటో స్వేచ్ఛ న్యూస్ పరిచయం మాత్రమే చేసింది. డబ్బుల కోసం ఏమైనా చేస్తామనే ఈ డ్రైనేజ్ పాలనపై రేపటి నుంచి ప్రతి రోజు పేరుకుపోయినా డ్రైనేజ్ ఏంటో మీ ముందు పొలిటికల్‌గా, పాలనగా ప్రజల ముందు స్వేచ్ఛ న్యూస్ ఉంచబోతోంది.


