తెలంగాణ

BRS: 5 ఎకరాలు, రూ.200 కోట్లు.. సీఎం రేవంత్‌పై లోకాయుక్తలో బీఆర్ఎస్ ఫిర్యాదు

రచన: NK••5 నిమిషాల పఠనం

BRS: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ తన సోదరుడు కొండల్ కు చెందిన కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ సహా ఐదుగురిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. 835/2026 నెంబర్ కేటాయించింది. త్వరలో ఈ కేసు లిస్టింగ్ అయి విచారణ జరగనుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ తన సోదరుడికి అక్రమంగా భూ కేటాయింపులు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కొండల్ రెడ్డి షెల్ కంపెనీకి రావిర్యాలలో 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని చెప్పారు. రేవంత్ భూదోపిడీకి అడ్డుకట్ట వేయాలని లోకాయుక్తను కోరారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.

కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్, ఆయన సోదరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ సోదరులు నామమాత్రపు అర్హతలతో భారీ కంపెనీలను రిజిస్టర్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. సీఎం సోదరులు బడా కంపెనీలకు యజమానులుగా మారుతున్నారని.. కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీలను చిన్న నివాసాల చిరునామాలతో రిజిస్టర్ చేయించారని తెలిపారు.

అటువంటి ఒక కంపెనీకే దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టిందని కేటీఆర్ తెలిపారు. అనుముల కొండల్ రెడ్డి తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో టెస్సెరాక్ట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపారు. మరో సోదరుడు జగదీశ్ రెడ్డి కాంట్రాక్టులు దక్కించుకుంటుండగా, సీఎం బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు.

కొండల్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మహేశ్వరం మండలం రావిర్యాలలో 200 కోట్ల విలువైన సుమారు 5 ఎకరాల ప్రభుత్వం భూమిని కేవలం రూ. 7 కోట్లకు కేటాయించారని చెప్పారు. ఆ కంపెనీకి కేవలం రూ.లక్ష మూలధనం ఉందని, పటాన్‌చెరులోని ఒక చిన్న నివాసం నుంచి కార్యకలాపాలు సాగిస్తోందన్నారు.

#BRS#Lokayukta#Telangana#Kondal Reddy#Land#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి