తెలంగాణ

Jupally Krishna Rao: టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

రచన: NK••3 నిమిషాల పఠనం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ దరఖాస్తులపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్న ఫైల్స్ పెండింగ్ లో ఉండడంపై మంత్రి సీరియస్ అయ్యారు.

Jupally Krishna Rao: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ దరఖాస్తులపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్న ఫైల్స్ పెండింగ్ లో ఉండడంపై మంత్రి సీరియస్ అయ్యారు.

Jupally Krishna Rao: టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ అధికారి బన్సీ లాల్ పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీలను మంత్రి పరిశీలించారు. అదే సమయంలో కార్యాలయంలోని టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించిన మంత్రి జూపల్లి సిబ్బందిపై మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మంత్రి స్వయంగా నీళ్లు పోసి టాయిలెట్లను శుభ్రం చేశారు. ఇలా అయినా అధికారులకు కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

Jupally Krishna Rao: టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

#Jupally Krishna Rao#Toilets#Clean#Revenue Office#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి