తెలంగాణ

TG : లండన్‌కు పొయినంత ఈజీ కాదు?

రచన: Kumar••6 నిమిషాల పఠనం

ఓవైపు కాంగ్రెస్‌ లోకల్ ఫైటింగ్ కార్యకర్తలకు కంగారు పుట్టిస్తుంటే, ఇంకోవైపు రవ్వంత రేవంత్‌పై ప్రేమ ఉండే నాయకులకు అమెరికా టూర్ రద్దు నిరాశ కల్పించింది. ఎందుకు ముందస్తుగా సీఎం స్థాయి లేని మీటింగ్స్‌తో అనుమతి పొందారనే విమర్శలు తావిస్తున్నాయి. ఇక్కడ రేవంతా, మరో వ్యక్తియా అని కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లే మీటింగ్‌కు కనీసం అక్కడ కూడా ఒక రాష్ట్రానికి చెందిన నేతల బిజినెస్ జరగాలి.

- విద్యార్దుల కోసం అంటే రాజకీయ క్లియరెన్స్ రాదు

- ఇక్కడ అంటే ఏదైనా రాజకీయం చేయొచ్చు

- అక్కడ చేయలేం సీఎం గారు

- ముఖ్యమంత్రి స్థాయికి చెందిన వారు ఎవరైనా పాల్గొంటారా?

- ఎలాంటి ప్రాముఖ్యత లేని బిజినెస్ మీటింగ్స్‌కు అధికారులు చాలు

- తెర వెనుక ఎజెండా ఇప్పుడు అమెరికాలో సాగడం లేదట?

- అక్కడ నుంచి మీ షెడ్యుల్ దుబాయ్ వ్యాపారం కూడా ఇక్కడ తెలిసిపోయిందా?

- సీఎం రేవంత్ రెడ్డికి గుంపులో రవ్వంత సమాచారం ఇచ్చే వారెక్కువయ్యారు

- రేవు తెలియని అడ్మిన్ వ్యవహారంతో అబాసు పాలు?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

ఓవైపు కాంగ్రెస్‌ లోకల్ ఫైటింగ్ కార్యకర్తలకు కంగారు పుట్టిస్తుంటే, ఇంకోవైపు రవ్వంత రేవంత్‌పై ప్రేమ ఉండే నాయకులకు అమెరికా టూర్ రద్దు నిరాశ కల్పించింది. ఎందుకు ముందస్తుగా సీఎం స్థాయి లేని మీటింగ్స్‌తో అనుమతి పొందారనే విమర్శలు తావిస్తున్నాయి. ఇక్కడ రేవంతా, మరో వ్యక్తియా అని కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లే మీటింగ్‌కు కనీసం అక్కడ కూడా ఒక రాష్ట్రానికి చెందిన నేతల బిజినెస్ జరగాలి. అలాంటి విదేశీ బిజినెస్ మీటింగ్ ఏమీ లేకపోవడంతో గుంపు మేస్త్రీ టీం పనితనం లోకల్‌లోనే తప్ప విదేశాల్లో లేదని తెలిసిపోయింది. కనీసం మంత్రులు కూడా పోవాల్సిన అవసరం లేని మీటింగ్స్‌కు సీఎం ఎందుకు ప్రాముఖ్యత చూపించారనేది కీలకంగా మారింది. అంతేకాదు, అక్కడి నుంచి దుబాయ్ షెడ్యూల్ ఎందుకు వచ్చిందనేది కూడా రేవంత్ ఆర్ధిక వ్యవహారాలను చూసే టీంకు ప్రశ్నలు మొదలయ్యాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాలు, సూచలనలతో ఇలాంటి వ్యవహారాలు భారీగానే జరిగాయని టాక్ ఉంది. కానీ, గంపగుత్తలా ఆలోచనలతోనే ఈ వ్యవహారం మొత్తం మొదటికి రావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితికి మరో దారి తీసింది.

గతంలో జరిగిన నిరాకరణ

2022లో కేజ్రీవాల్‌ విదేశీ పర్యటనను నిరాకరించారు. చాలా నాటకీయ పరిణామాల మధ్య సింగపూర్‌ టూర్‌కు క్లియరెన్స్ ఇవ్వలేదు. అంతకుముందు 2019లో సీఎం స్థాయి కాదని క్లైమెట్ సమితికి నిరాకరించారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ పాల్గొన్నారు. యూపీఏ హయాంలో 2012లో ఆనాటి అసోం సీఎం తరుణ్ గొగోయ్‌ను అమెరికా, ఇజ్రాయిల్ పర్యటనకు నిరాకరించారు. దౌత్య కారణాల సాకుతో జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాను 2011లో థాయిలాండ్‌కు అనుమతి ఇవ్వలేదు. 2021లో మమతా నేపాల్‌కు వేళ్లేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించింది. భగవంత్ మాన్‌ను ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయిల్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌కు ఎన్నోసార్లు నిరాకరించారు. ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకున్నా ముఖ్యమంత్రి స్థాయి మీటింగ్స్‌కు కాకపోతే తిరస్కరించే అధికారం కేంద్రానికి ఉంది.

రేవంత్‌కు తెలియలేదా?

అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు అధిస్టానంతో అన్ని పనులు చక్కదిద్దే రేవంత్‌కు ఈ టెక్నికల్ వ్యవహారం తెలుసుకోకపోవడం అశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదైనా ఫారిన్ ఫండింగ్ వ్యవహారం మీటింగ్ షెడ్యూల్ ఉందా? అందుకే లండన్‌తో పాటు క్లియరెన్స్ ఇవ్వలేదా? అటు నుంచి దుబాయ్ అని చెప్పడంతో ఈ ఇబ్బందులు ఏర్పాడ్డాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు రేవంత్ టీంకే తెలియాలి. కానీ, ఈ వ్యవహారంతో 22ఏ నష్టానికి, పార్టీ గొడవలకు, ఈ రిటర్న్‌కు అనేక అంశాలు వేలెత్తి చూపిస్తున్నాయి.

#cm revanth reddy#london#america tour cancel#congress#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి