Irumudi: మాజ్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా బేనీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ సినిమా బాక్సాఫీస్ భారీ ఓపెనింగ్ రాబట్టడమే కాదు, చాలా కాలంగా హిట్ లేక ఎదురుచూస్తున్న రవితేజ ఖాతాలో సాలీడ్ హిట్ పడింది.
మాస్ మహారాజ్ అనే ఇమేజ్ ను ఏమాత్రం కదపకుండా రవితేజ ఇమేజ్ కి తగ్గట్టే కథ, కథనాలను అద్భుతంగా తయారు చేసుకున్న దర్శకుడు శివ నిర్వాణ, సన్నివేశాలలో వచ్చే బలమైన ఎమోషన్స్‌ను అంతే చక్కగా తీర్చిదిద్దాడు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా కీలకంగా అనిపిస్తాయి. రవితేజ పర్ఫార్మెన్స్ మొత్తం సినిమాకి హైలెట్‌గా నిలిచింది.
ముందు నుంచి ఇరుముడి సినిమాపై మేకర్స్ కంటెంట్‌తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. ఆ వైబ్స్ సినిమా రిలీజైయ్యాక డబుల్ అయి బాగా కలిసి వచ్చింది. వరుస ఫ్లాపుల్లో ఉన్నా కూడా రవితేజ సినిమాకి ఇలా ఓపెనింగ్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా, కథ-కథనాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు సినిమాను నిలబెట్టాయి. భార్య పాత్రలో నటించిన ప్రియా భవానీ శంకర్ సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశంలో బాగా ఆకట్టుకుంది.
తండ్రీ-కూతురు మధ్య వచ్చే అన్నీ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మల్లెపూల పల్లకి సాంగ్ గనక అయ్యప్ప భక్తులు మాలధారణలో ఉంటే ఆనందంతో పరవశించిపోతారు. ఇందులో సందేహమే లేదు. రవి తేజ కెరీర్‌లోనే ఇరుముడి ఒక ప్రత్యేకమైన సినిమా అనడానికి ఇందులో, చాలానే పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మ్యూజికల్‌గా కూడా సినిమాకి ప్లస్ అయింది. గత కొంతకాలంగా శివ నిర్వాణకి సక్సెస్ లేకపోవడంతో ఈ సినిమా కోసం ఆయన ఎంత తాపత్రయపడ్డాడో థియేటర్స్‌లో తెలుస్తుంది.


