Kaaka Teaser: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రానికి 'కాకా' అనే టైటిల్ పెట్టారు. ఈ రోజు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తూ చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సదర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు.
ఇక, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో మెగాస్టార్ స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ దుమ్ములేపాడు. మొత్తానికి, అన్నయ్య బర్త్ డే సందర్భంగా వస్తుందనుకున్న బర్త్ డే గిఫ్ట్ రానే వచ్చింది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియమణి, చిరు కూతురు పాత్రలో అనస్వర రాజన్..కీలక పాత్రల్లో సునీల్, గెటప్ శ్రీను కనిపించబోతున్నారు.
వాస్తవానికి నిన్నా మొన్నటి వరకూ ఈ చిత్రానికి ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ పెట్టన్నట్లు ప్రచారం సాగింది. కానీ, తాజాగా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘కాకా’ అనే ఊరమాస్ టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ టైటిల్. గ్లింప్స్ ను వదిలారు. ఇక, ఇందులో చిరు స్వాగ్, బాబీ మేకింగ్ అంతా చూస్తే సంక్రాతికి మెగా ఫ్యాన్స్ పూనకాలు రావడం గ్యారెంటీ. గ్లింప్స్ లో మరో హైలెట్ ఏంటంటే గ్యాంగ్ లీడర్ లోని సాంగ్ రీమీక్స్ చేయడం.


