National

Punjab : రేప్ కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యకు ఎన్‌హెచ్‌ఆర్సీ షాక్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

పంజాబ్ ప్రభుత్వం వరుసగా విమర్శల పాలవుతోంది. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం, దీనికి తోడు రాష్ట్రంలో విచ్చల విడిగా మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయింది.గతంలో ఉన్న ప్రభుత్వాలు పంజాబ్‌ను మత్తులో ముంచేశారని.. తమకు చాన్స్ ఇస్తే డ్రగ్స్ నిర్మూలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ సర్కార్.. చేతల్లో చేసి చూపించలేకపోయింది.

పంజాబ్ ప్రభుత్వం వరుసగా విమర్శల పాలవుతోంది. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం, దీనికి తోడు రాష్ట్రంలో విచ్చల విడిగా మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయింది.గతంలో ఉన్న ప్రభుత్వాలు పంజాబ్‌ను మత్తులో ముంచేశారని.. తమకు చాన్స్ ఇస్తే డ్రగ్స్ నిర్మూలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ సర్కార్.. చేతల్లో చేసి చూపించలేకపోయింది.దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి యువత మత్తుకు చిత్తవుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం చోద్యం చూస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెల్తుతున్నాయి.

ఇదిలాఉండగా, స్వయంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్యపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఓ అత్యాచారం కేసును తొక్కి పెట్టేందుకు ఆమె రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో వెల్లడించారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

నివేదిక సమర్పించడానికి 15 రోజుల సమయం ఇచ్చింది.అదేవిధంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉమెన్స్ సేఫ్టీ విభాగానికి కూడా ఈ సమాచారాన్ని అందజేసినట్టు ప్రియాంక్ కనూంగో తెలిపారు. ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రజా సంక్షేమం కోసం మాత్రమే వినియోగించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక అందాకే తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపారు.

#punjab cm wife#rs.5 crore#demand#rape case#NHRC#notice
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి