తెలంగాణ

HYD : జనసేన ఎంపీ కొడుకును అరెస్టు నుంచి తప్పించలేదు : డీసీపీ రితిరాజ్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రెండ్రోజుల కిందట జరిగిన కారు ప్రమాదంలో లైఫ్‌స్టైల్‌లో పనిచేసే ఓ యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన ఏపీ జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ ప్రస్తుతం బయటే తిరుగుతున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రెండ్రోజుల కిందట జరిగిన కారు ప్రమాదంలో లైఫ్‌స్టైల్‌లో పనిచేసే ఓ యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన ఏపీ జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ ప్రస్తుతం బయటే తిరుగుతున్నట్టు సమాచారం. ఆయన్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని తెలిసింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితుడిని నేటికి అరెస్టు చేయకుండా విచారణ పేరిట మాదాపూర్ పోలీసులు కాలయాపన చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, డబ్బులకు అమ్ముడుపోయారా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ.. మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో సంజూష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో డీసీపీ రితిరాజ్ వివరణ ఇచ్చారు.

ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసి నిందితుడు సంజుష్‌కు ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్షలు నిర్వహించామని, ఆ టెస్టులో ఫలితాలు ‘నెగెటివ్’గా వచ్చాయని తెలిపారు. సంజుష్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, కారుని స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ తనిఖీ కోసం పంపామన్నారు. MVI నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, సంజుష్‌పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.

అయితే, కేసు విచారణలో భాగంగా ఆధారాలను పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏవీ కనిపించలేదని, అందుకే విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ BNSS సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చామన్నారు.చట్టపరమైన నిబంధనలు, కేసు పరిస్థితులు, సాక్ష్యాల ఆధారంగానే అరెస్ట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నామన్నారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, MVI నివేదికతో ఇతర సంబంధిత ఆధారాలను సేకరించి పరిశీలిస్తామని డీసీపీ తెలిపారు.ఆ ఆధారాల ప్రకారం జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్‌ని అరెస్ట్ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడిని అరెస్ట్ నుంచి తప్పించారని ఆరోపించడం తగదని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.

#janasena mp lingamaneni ramesh#son sanjush#car accident case#not arrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి