ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 19న మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇద్దరూ ఓకే రూంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఈశ్వర్ సాయి భార్య వీరిని పట్టుకోవడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే,ఆ సమయంలో ఈశ్వర్ సాయి భార్య తనను ఇష్టాను సారంగా దూషించడంతో పాటు తన ఫోన్‌ను దొంగిలిచిందని, అందులోని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిందని వేములవాడ పీఎస్‌లో మాధురి ఫిర్యాదు చేసింది.
ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలను చేర్చినట్టు తెలిసింది. ఈ నెల 19న రెడ్డి భవన్‌లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిందని మాధురి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన సమయంలో సుమారు రూ.50 వేల విలువైన తన ఐఫోన్‌ను కూడా తీసుకెళ్లారని ఆరోపించారు.
అంతేకాకుండా తనకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వాటిని తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఫిర్యాదులో తెలిపారు.కొన్ని మీడియా సంస్థలు కూడా తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాయని ఆరోపించారు.
కాగా, మాధురి రాథోడ్ ఫిర్యాదు ఆధారంగా వేములవాడ పోలీసులు శరణ్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా చూడాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఓకే రూంలో ఈశ్వర్ సాయి ఒంటిమీద చొక్కా లేకుండా షార్ట్ మీద ఉన్న వీడియో.. బెడ్ మీద మాధురి కూర్చుని దుప్పటి కవర్ చేసుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది వీరి గురించి సెర్చ్ చేయగా.. ఈశ్వర్ సాయి, మాధురి కలిసి నటించిన సాంగ్స్ ప్రస్తుతం మరోసారి ట్రెండ్ అవుతున్నట్టు తెలిసింది.


