ఏపీ

Ap : లవ్ మ్యాటర్?.. విశాఖలో నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్ వార్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో నడిరోడ్డుపై కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగినట్టు తెలిసింది. రెండు వర్గాలుగా విడిపోయిన స్టూడెంట్స్ దారుణంగా దాడులు చేసుకున్నారు.

ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో నడిరోడ్డుపై కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగినట్టు తెలిసింది. రెండు వర్గాలుగా విడిపోయిన స్టూడెంట్స్ దారుణంగా దాడులు చేసుకున్నారు.

అయితే, యువకుల మధ్య కొట్లాటకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. చంద్రంపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గ్యాంగ్ వార్‌గా మారినట్టు తెలుస్తోంది. ఘర్షణ జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఆపిన విద్యార్థులు అతనిపై కూడా దాడి చేశారు.

దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే, గురువారం రాత్రి మరోసారి ఘర్షణకు ప్రయత్నించగా పోలీసులు రావడంతో యువకులు పరార్ అయినట్టు సమాచారం.గొడవ పడిన యువకుల్లో చాలామంది మద్యం సేవించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు మొత్తం 20 మంది యువకుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అందులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. వీరిలో ముగ్గురు మేజర్లు కాగా, ముగ్గురు మైనర్లు అని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2091049721779659104?s=20

రాష్ట్రంలో వరుసగా దాడులు, హత్యలు, మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతున్నదని, కూటమి సర్కార్ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఆలస్యంగా స్పందించడం, అధికారపార్టీ నేతలకు కొమ్ముకాయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

#students#gangwar#love matter#vizag#casefile
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి