సినిమా

Priya Bhavani Shankar: తెలుగులో ఫస్ట్ బ్లాక్ బస్టర్..ఇక క్రేజీ ఆఫర్స్

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Priya Bhavani Shankar: ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ గురించే. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. బేబీ నక్షత్ర కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఇంతకముందే తెలుగులో సినిమాలు చేసినా, మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం ప్రియ భవానీకి ఇరుముడి.

మన సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకునే వాళ్ళు రక రకాల ఫీల్డ్స్ నుంచి వస్తారు. కొందరు స్మాల్ స్క్రీన్ మీద యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి వస్తే, కొందరు మోడలింగ్ రంగం నుంచి వస్తారు. ఇంకొదరు అందంతో ఆకట్టుకొని వస్తారు. ఇంకొందరు ఇంట్లో సినిమా వాతావరణం ఉండి అత్యంత సన్నిహితులుంటే అలా వస్తారు. ఇక, వారసత్వంగా వచ్చే వారు మరికొందరు.

అయితే, ప్రియ భవానీ శంకర్ కెరీర్ యాంకర్ గా మొదలైంది. అలా గుర్తింపు వచ్చిన తర్వాత తమిళంలో హీరోయిన్‌గా అవకాశం అందుకొని బిజీగా మారింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. ‘కళ్యాణం కమనీయం’, ‘భీమా’, ‘జీబ్రా’ సినిమాలు చేసింది. ఇవేవీ తనకి సరైన విజయాన్ని ఇవ్వలేదు. అంతేకాదు, నాగచైతన్యతో చేసిన వెబ్ సిరీస్ ‘దూత’ పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా అది ఓటీటీకే పరిమితమైంది.

దీంతో, ఇప్పుడు చేసిన ఇరుముడి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. రవితేజ సరసన వచ్చిన ‘ఇరుముడి’ సినిమాతో ప్రియ భవానీ శంకర్ కి మంచి థియేట్రికల్ హిట్ గా నిలిచింది. ఇందులో పెళ్లి కాకుండానే, ఎలాంటి సందేహాలు లేకుండా పదేళ్ల పాపకు తల్లిగా మిడిల్ క్లాస్ మహిళగా కనిపించి ఈ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇరుముడి సినిమాతో పర్ఫార్మెన్స్‌కి ప్రాధాన్యమున్న పాత్రలు వచ్చే అవకాశం ఉందని ధైర్యాన్ని సంపాదించుకుంది.

#Priya Bhavani Shankar#IrumudiMovie#Ravi Teja#Shiva Nirvana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి