సినిమా

Raaka Movie: ఐకాన్ స్టార్ పాన్ వరల్డ్ మూవీలో మంచు లక్ష్మీ.!?

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో మంచు ఫ్యామిలీ అమ్మాయి, నటి-నిర్మాత-హోస్ట్ మంచు లక్ష్మీ ఓ కీలక పాత్రలో కనిపించబోతుందనేది లేటెస్ట్ న్యూస్. మంచు లక్ష్మీ గుండెల్లో గోదావరి, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ, ఇంతకాలానికి 'రాకా'లో కనిపించబోతుందట.

Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో మంచు ఫ్యామిలీ అమ్మాయి, నటి-నిర్మాత-హోస్ట్ మంచు లక్ష్మీ ఓ కీలక పాత్రలో కనిపించబోతుందనేది లేటెస్ట్ న్యూస్. మంచు లక్ష్మీ గుండెల్లో గోదావరి, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ, ఇంతకాలానికి 'రాకా'లో కనిపించబోతుందట.

అయితే, ఈ విషయాన్ని ఇప్పటి వరకూ 'రాకా' మూవీ మేకర్స్ కన్‌ఫర్మ్ చేయలేదు. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ముంబైలోనే భారీ సెట్స్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే గత కొన్ని నెలల నుంచి ముంబైలో ఉంటున్నాడు. దీపిక పడుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ఒక్క విషయమే అధికారికంగా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు.

రష్మిక, జాన్వీ, మృణాల్?

అల్లు అర్జున్-అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న 'రాకా' మూవీలో మేయిన్ హీరోయిన్‌గా దీపికను మేకర్స్ వీడియో ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. కానీ, ఇందులో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రచారం జరుగుతోంది. రెండు భాగాలుగా వస్తుందనే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, హీరోయిన్స్ విషయం గానీ, ఇతర నటీనటుల గురించి గానీ, రెండు భాగాలుగా వస్తోన్న విషయంలో గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇక, తాజాగా మంచు లక్ష్మీ కీలక పాత్రలో కనిపించబోతుందని వార్త వైరల్ అవుతోంది. కానీ, అసలు విషయం ఏమిటంటే ముంబైలో వేసిన 'రాకా' సెట్స్‌కి మంచు లక్ష్మీ వెళ్ళారు. అక్కడ జరుగుతున్న షూటింగ్, సెట్స్ లో ఉన్న ప్రాణుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ చూసి నోరెళ్ళబెట్టిందట. గ్యారెంటీగా రాకా ఓ గొప్ప విజువల్ వండర్ అని ఆమె పేర్కొనింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. కాగా, కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ 750 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

#Raaka#Allu Arjun#Atlee#Manchu Lakshmi#Deepika Padukone
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి