తెలంగాణ

Mahesh Kumar Goud: గతంలో కాపాడాను, ఇప్పుడా అవకాశం లేదు.. కొండా సురేఖ ఇష్యూపై మహేశ్ కుమార్ గౌడ్

రచన: NK•••4 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు కొండా సురేఖ ఇచ్చిన వివరణ కాంగ్రెస్ లో చిచ్చు రాజేశాయి. తన కూతురు చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవడాన్ని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని, ఆమెను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు.

Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు కొండా సురేఖ ఇచ్చిన వివరణ కాంగ్రెస్ లో చిచ్చు రాజేశాయి. తన కూతురు చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవడాన్ని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని, ఆమెను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో కొండా సురేఖ అంశంపై చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖను గతంలో తాను కాపాడానని ఆయన తెలిపారు. అప్పుడు అవకాశం ఉండటంతో కొండా సురేఖను కాపాడానని, ఇప్పుడు కాపాడే అవకాశం లేదని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత లైన్ దాటి నేరుగా సీఎం రేవంత్ పైనే ఆరోపణలు చేశారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఇక, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైనా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆ ఇద్దరు డైరెక్ట్ విమర్శలు చేయలేదని చెప్పారు. క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత తాను స్పందిస్తానని వెల్లడించారు. ఏది ఏమైనా కొండా సురేఖపై అధిష్టానం సీరియస్ గా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కొండా సురేఖను కాపాడే అవకాశం లేదని, అధిష్టానం సీరియస్ గా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొండా సురేఖపై చర్యలు తప్పేలా లేవన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరందుకుంది.

#Mahesh Kumar Goud#Telangana Congress#Konda Surekha#Konda Sushmita#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి