సినిమా

Chiranjeevi: ఆ రెండు సినిమాలు ఆగిపోలేదు..కానీ!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో విశ్వంభర, శీకాంత్ ఓదెల సినిమాల నుంచి ఇటీవల ఏ అప్‌డేట్ రాలేదని మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కానీ, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చారు, ఆయా చిత్రాల మేకర్స్. ఈ రెండు సినిమాలు ఆగిపోలేదని కన్‌ఫర్మ్ అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాలపై మళ్ళీ అంచనాలను పెంచుకుంటున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో విశ్వంభర, శీకాంత్ ఓదెల సినిమాల నుంచి ఇటీవల ఏ అప్‌డేట్ రాలేదని మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కానీ, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చారు, ఆయా చిత్రాల మేకర్స్. ఈ రెండు సినిమాలు ఆగిపోలేదని కన్‌ఫర్మ్ అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాలపై మళ్ళీ అంచనాలను పెంచుకుంటున్నారు.

విశ్వంభర:

బింబిసార లాంటి హిస్టారికల్ చిత్రాన్ని తీసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి వశిష్ట..ఏకంగా రెండవ సినిమానే మెగాస్టార్‌తో చేసే ఛాన్స్ అందుకున్నాడు. టైటిల్, పోస్టర్‌లతో ఒక్కసారిగా అంచనాలను పెంచాడు. కానీ, టీజర్ వచ్చాక మాత్రం అది ఆశించిన స్థాయిలో ఏమాత్రం లేదని చిరు బాగా ఫీలయ్యాడట. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా కూడా వీఎఫెక్స్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. దానికితోడు ఈ మధ్య అప్‌డేట్స్ రాకపోయేసరికి ఇక, విశ్వంభర రానట్టే అనుకున్నారు. కానీ, తాజాగా ఈ సినిమా ఉందని కొత్త పోస్టర్ ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. కాకపోతే రిలీజ్ డేట్ ఎప్పుడనేది వెల్లడించలేదు. అదే ఒక డిసప్పాయింట్‌మెంట్.

చిరు-నాని-శ్రీకాంత్ ఓదెల:

మెగాస్టార్ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబందించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో, ఈ కాంబోలో కూడా సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు శ్రీకాంత్ తన అభిమాన హీరో పుట్టినరోజుకి విషెస్ చెప్తూ..టీ – రెక్స్ అని సాలీడ్ హైప్ ఇచ్చాడు. మన కాంబోలో సినిమా స్టార్ట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను..లైఫ్ టైల్ల్ మర్చిపోలేని మెమరీస్ ని పొదుతానంటూ..'బాస్ సార్' అని పోస్ట్ పెట్టాడు.

టీ – రెక్స్ అంటే అర్థం ఏమిటి?

టీ – రెక్స్ అంటే టైరన్నోసారస్ రెక్స్ (T. రెక్స్) అనేది దాదాపు 66 నుండి 68 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన అతిపెద్ద మాంసాహార డైనోసార్ జాతులలో ఒకటి. దీని అర్థం "నిరంకుశ బల్లుల రాజు". ఇది సుమారు 40 అడుగుల పొడవు, 8 టన్నుల బరువు కలిగి శక్తివంతమైన దవడలతో వేటాడేది. అంటే, చిరు-శ్రీకాంత్ కాంబోలో ఉండే సినిమా ఎంత వైల్డ్ గా ఉండబోతుందో ఈ ఒక్క పదంతో హింట్ ఇచ్చాడు. మొత్తానికి, ఆగిపోయినట్టుగా ప్రచారం జరిగిన రెండు సినిమాల అప్‌డేట్స్ వచ్చేశాయి.

#megastarchiranjeevi#chiranjeevi#Vishwambhara#Srikanth odela#nani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి