తెలంగాణ

DGP Sanjay Kumar Jain: సాయుధ చైతన్య విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయం, బెటాలియన్ అభివృద్ధికి కృషి-డీజీపీ సంజయ్ జైన్

రచన: NK••4 నిమిషాల పఠనం

బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయుధ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయమని, పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు.

DGP Sanjay Kumar Jain: బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయుధ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయమని, పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు.

శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ పోలీస్ బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులతోపాటు అతిథి గృహ భవన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ తో పాటు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. అతిథులకు పోలీసుల గౌరవ వందనం అనంతరం పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని అతిధులు ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. అనంతరం నూతన తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

DGP Sanjay Kumar Jain: సాయుధ చైతన్య విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయం, బెటాలియన్ అభివృద్ధికి కృషి-డీజీపీ సంజయ్ జైన్

పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం అన్ని వసతులతో, తక్కువ సమయంలోనే నిర్మించడం అభినందనీయం అని అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. బెటాలియన్ లోని అధికారులు, సిబ్బంది అంకితభావం, కృషితోనే పాఠశాల అభివృద్ధి జరుగుతోందని, భవిష్యత్తులో కూడా ఇదే పనితీరు కనబరచాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర స్థాయి టాపర్స్ గా నిలిచేందుకు అత్యుత్తమ బోధన చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బెటాలియన్ పాఠశాలను అభివృద్ధి చేయడం, 20 ఏళ్లుగా పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు కావడం గర్వకారణం అన్నారు. ప్రస్తుతం ఇక్కడ వెయ్యి మందికిపైగా విద్యార్థులు విద్యను అభ్యసించడంతోనే ఈ పాఠశాల ప్రత్యేకత అర్థమవుతుందన్నారు. తక్కువ సమయంలోనే అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసిన సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల మరింత అభివృద్ధి చెంది అత్యుత్తమ ఫలితాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. బెటాలియన్ లో అవసరమైన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు.

DGP Sanjay Kumar Jain: సాయుధ చైతన్య విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయం, బెటాలియన్ అభివృద్ధికి కృషి-డీజీపీ సంజయ్ జైన్

బెటాలియన్ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామని, ఇక్కడి సిబ్బంది శాంతి భద్రతలను కాపాడడంలో తమ వంతుగా కృషి చేస్తున్నారని ఎస్పీ శ్రీనివాసరావు కొనియాడారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అత్యవసర సమయంలో తమ సేవలందిస్తూ ప్రజల ఆధారాభిమానాలు చూరగొన్నారని అన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పలువురు సిబ్బందికి అతిథులు ప్రశంసా పత్రాలు అందజేశారు.

#Dgp Sanjay Kumar Jain#TGSP Battalions#Sayudha Chaitanya High School#Yarravally#Jogulamba Gadwal#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి