సినిమా

Ravi Teja-Irumudi: మాస్ రాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్..రెండవరోజే లాభాల్లోకి!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Ravi Teja-Irumudi: సరైన హిట్ పడాలే గానీ, రవి తేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని అందుకోగలడో తాజాగా విడుదలైన ఇరుముడి సినిమా నిరూపించింది. ఒకప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్న రవి తేజ క్రాక్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. మళ్ళీ ఇంతకాలానికి, ఇరుముడి సినిమాతో భారీ హిట్ కొట్టాడు. కేవలం 2 రెండు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం గొప్ప విషయం.

ధమకా తర్వాత మళ్ళీ రవి తేజకి హిట్ పడింది లేదు. వరుసగా సినిమా వెనకాల సినిమా చేస్తూ వస్తున్నాడు గానీ, సాలీడ్ హిట్ మాత్రం చూడలేదు. ఇటీవల వచ్చిన ప్రతీ సినిమా హిట్ అనే నమ్మకంతో మాట్లాడాడు. కానీ, రొటీన్ కథలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇలాంటి, సమయంలో శివ నిర్వాణ లాంటి దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాస్త షాకింగ్ విషయమే.

అసలు, ఈ కాంబినేషన్‌ని ఊహించలేదు కూడా. నిన్ను కోరి, మజిలీ, ఖుషీ సినిమాలు చూసిన వాళ్ళంతా.. రవి తేజతో ఎలాంటి కథ తీస్తాడో అని సందేహాలను వ్యక్తపరిచారు. కానీ, ఇరుముడి అందరి సందేహాలను ఒక్క దెబ్బతో తీసి పక్కన పెట్టింది. ఈ సినిమాతో అందరూ భారీ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడిగా శివ నిర్వాణ కూడా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయం. ఏ హీరోకైనా, పడాల్సిన కథ కరెక్ట్‌గా పడితే అది ఇరుముడి రేంజ్ హిట్‌గా నిలుస్తుంది.

ఈ సినిమాతో హీరోయిన్‌గా నటించిన ప్రియ భవానీ శంకర్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఖచ్చితంగా ఈ బ్యుటీ అరడజను సినిమాలకైనా సైన్ చేసేయొచ్చు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. తండ్రి పాత్రలో రవి తేజ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, అయ్యప్ప మాలలో ఉండి ఎమోషనల్‌గా చేసిన సన్నివేశాలు హత్తుకున్నాయని ప్రేక్షకులు చెప్తున్నారు. మైత్రీ వారితో మాస్ రాజాకి ప్రత్యేకమైన బంధం ఉంది. వారికి సాలీడ్ హిట్ దక్కింది.

#Ravi Teja#Irumudi#ShivaNirvana#Priya Bhavani Shankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి