Kaaka Teaser: బాబీ..తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ చిత్రాలతో హిట్ కొడుతున్న దర్శకుల్లో ఒకరు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మెగా 158 సినిమాకి సంబందించి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. కాకా అనే టైటిల్ తో పాటు చిరు పాత్ర ఎలా ఉండబోతుంది..అనేది జస్ట్ ఓ శాంపిల్ ని వదిలాడు బాబి. ముఖ్యంగా థమన్ బీజీఎం ఎప్పటిలాగే మోగిపోయింది. దీనిపై, బాబీ మాట్లాడుతూ, కాకా టైటిల్ టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు ఇంకా అద్భుతాలు చూస్తారని తెలిపాడు.
బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య థియేటర్స్‌లో రిలీజై భారీ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి-రవితేజ కలిసి నటించిన ఈ సినిమా నిర్మాతకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత, బాలకృష్ణతో 'డాకూ మహారాజ్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాలయ్య విధ్వంశం సృష్ఠించాడు. ముఖ్యంగా, థమన్ బీజీఎం 'డాకూ' సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది.
ఇప్పుడు, బాబీ-మెగాస్టార్-ఎస్.ఎస్.థమన్ కాంబినేషన్‌లో 'కాకా' రాబోతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని రిలీజ్ చేయడంతో పాటు ఆయన రోల్ ఎలా ఉండబోతుందో అలా, శాంపిల్ చూపించాడు బాబీ. 'కాకా' టీజర్ కి కేవలం ఒక్క మెగా ఫ్యాన్స్ నుంచే కాకుండా, సినీ లవర్..ప్రేక్షకుల నుంచి సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ లుక్స్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఒక మాస్ లీడర్‌గా ఆయన పాత్ర ఉండబోతుందని హింట్ ఇచ్చాడు బాబీ.
ఇక, ఈ సినిమాలో చిరంజీవికి కూతురు పాత్రలో అనస్వర రాజన్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి బాగా హైలెట్ అవుతాయట. ఇక, టీజర్ చూస్తే సునీల్..గెటప్ శ్రీను పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి..'కాకా' మాత్రం ప్రతీ ఒక్కరిలో కాక రేపబోతున్నాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. మన శంకరవప్రాద్‌గారు సినిమాతో అందుకున్న భారీ హిట్ ని అలాగే కొనసాగించబోతున్నారు చిరు.


