సినిమా

Surya vs Ravi Teja: విశ్వనాథ్‌కి బ్రేక్ వేసిన ఇరుముడి!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Surya vs Ravi Teja: ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో హిట్ కోసం చూస్తున్న అఖిల్ లెనిన్ సినిమాతో హిట్ కొట్టాడు. అలాగే, గత కొంతకాలంగా సక్సెస్ అందుకోలేకపోయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కొరియన్ కనకరాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే, సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సాలీడ్ హిట్ సాధించింది. కానీ, ఈ సినిమా ఫుల్ స్వింగ్‌కి ఇరుముడి బ్రేక్ వేసింది.

సితార నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తమిళ హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఈ సినిమా 150 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టింది. గత కొంతకాలంగా హిట్ లేని సూర్యకి మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి సూపర్ హిట్ ఇచ్చాడు. అయితే, ఇంకా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుందనుకున్న ఈ మూవీకి ఇరుముడి గండి కొట్టేసింది.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి ఈ ఆగస్టు 21న రిలీజైంది. ధమాకా తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు మాస్ రాజా. అయితే, డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకొని ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా రాబట్టలేనంతగా, 2 రోజుల్లోపే బ్రేకీవెన్ అయింది ఇరుముడి. దీంతో, సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ కి వస్తున్న కలెక్షన్స్ పూర్తిగా డ్రాపయ్యాయి.

ఆల్రెడీ 150 కోట్లకి పైగానే వసూళ్ళు రాబట్టింది విశ్వనాథ్ అండ్ సన్స్. అయితే, తమిళంలో వసూళ్ళు బాగా తగ్గిపోయినప్పటికీ ఇరుముడి సినిమా రాకముందు వరకూ తెలుగులో డీసెంట్ వసూళ్లతో రన్ అయింది. ఎప్పుడైతే రవితేజ వచ్చి బాక్సాఫీస్ వద్ద దిగాడో..ఇరుముడి బ్లాక్ బస్టర్ అని మౌత్ టాక్ వచ్చిందో సడన్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్ డ్రాప్ హెవీగా కనిపించింది. రెండు కుటుంబ కథా చిత్రాలైనప్పటికీ సూర్య కంటే రవితేజ ప్రభావం మన తెలుగు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి..అది స్పష్టంగా కనిపించింది.

#suriyavsraviteja#vishwanath and sons#irumudi#suriya#raviteja
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి