తెలంగాణ

Hyd : అంజయ్య నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. ఆ కట్టడాలు కూల్చుతారా?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ మహానగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల అక్రమ నిర్మాణం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. భవనం ఒక్కసారిగా కూలడంతో పక్కన ఉన్న అపార్ట్ మెంట్స్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు.

హైదరాబాద్‌ మహానగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల అక్రమ నిర్మాణం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. భవనం ఒక్కసారిగా కూలడంతో పక్కన ఉన్న అపార్ట్ మెంట్స్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు.

మృతి చెందిన కార్మికులు మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులుగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి శిథిలాల తొలగింపులో ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? మరణించి ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలాఉండగా, కేవలం 40 గజాల్లోనే సాజిద్ అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రమాదం అనంతరం సాజిద్ పరారీలో ఉండగా అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని అంత ఎత్తులో నిర్మించడంతో పాటు ఇద్దరు మృతికి కారణమైన సాజిద్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలాఉండా, నిన్న కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాలు పక్కన ఉండే జయదర్శి అపార్ట్‌మెంట్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే, దానిని కూడా ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేసే అవకాశం కూడా ఉంది.అంజయ్య నగరలో మరో నాలుగు అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూడా కూల్చుతామని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దెబ్బతిన్న భవనంతో పాటు మరో నాలుగింటిని ఇవాళ హైడ్రా అధికారులు కూల్చుతారా? లేదా ముందుగా దెబ్బతిన్న ఇంటిని కూల్చేసి నోటీసులు ఇచ్చాక మిగతా ఆ నాలుగు కట్టడాలను కూల్చుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం.

#illegal buildings#demolish#rescue continue#madhapur#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి