International

దేశంలో 8.7కోట్ల మంది యువత ఖాళీ.. నీతి ఆయోగ్ సంచలన నివేదిక!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

చేతిలో డిగ్రీలు ఉన్నా.. చదువు పూర్తి చేసినా.. యువతకు మాత్రం సరైన ఉపాధి దొరకడం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోంది. చదువు, ఉద్యోగం, కనీసం నైపుణ్య శిక్షణ కూడా లేకుండా కోట్లాది మంది యువతీయువకులు ఖాళీగా ఉంటున్న వైనం దేశ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

చేతిలో డిగ్రీలు ఉన్నా.. చదువు పూర్తి చేసినా.. యువతకు మాత్రం సరైన ఉపాధి దొరకడం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక అద్దం పడుతోంది. చదువు, ఉద్యోగం, కనీసం నైపుణ్య శిక్షణ కూడా లేకుండా కోట్లాది మంది యువతీయువకులు ఖాళీగా ఉంటున్న వైనం దేశ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యువత ఉపాధి, నైపుణ్యాల పరిస్థితిపై నీతి అయోగ్ నివేదికలో ఆందోళనకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది.

దేశవ్యాప్తంగా 15 నుంచి 29ఏళ్ల వయసున్న సుమారు 8.7కోట్ల మంది యువతీయువకులు ప్రస్తుతం ఎలాంటి చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా ఖాళీగా ఉంటున్నట్లు తేలింది. ‘రీఇమైజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ @2047’ పేరిట రూపొందించిన ఈ నివేదికలో వీరందరినీ ‘నీట్’ (Not in Education, Employment or Training - NEET) వర్గంగా నీతి ఆయోగ్ పేర్కొంది. 2021 నాటి నేషనల్ శాంపిల్ సర్వే (NSS) గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

ఈ ‘నీట్’ కేటగిరీలోని యువతలో దాదాపు 88శాతం మంది పూర్తిగా గృహ సంబంధిత పనులకే పరిమితమవుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక డిగ్రీ పూర్తి చేసిన వారిలో కేవలం 8.25శాతం మంది మాత్రమే తమ చదువుకు తగిన ఉద్యోగాలను సాధించగలుగుతున్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రాక్టికల్ నైపుణ్యాలు కొరవడటమే ఈ నిరుద్యోగ పరిస్థితికి ప్రధాన కారణమని నివేదిక విశ్లేషించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశంలోని శ్రామిక శక్తిని ఐదు ప్రత్యేక విభాగాలుగా విభజించి తగిన చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.

ముఖ్యంగా ‘నీట్’ యువతతో పాటు మహిళలకు రాయితీ ధరల్లో నైపుణ్య శిక్షణ, తగిన ఆర్థిక సాయం అందించాలని సూచించింది. ప్రాంతీయ అవసరాలకు తగినట్లుగా స్వయం ఉపాధి, అభివృద్ధి చెందుతున్న రంగాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని కోరింది. 2014-15 నుంచి ఇప్పటివరకు 7.67కోట్ల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్న ఆయోగ్, రాష్ట్రాలు కూడా తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక స్కిల్లింగ్ ప్రణాళికలను అమలు చేయాలని స్పష్టం చేసింది.

#Niti Aayog NEET Report India 2026#Unemployed Youth In India Niti Aayog#Reimagining Skilling Viksit Bharat 2047#National Sample Survey Data Youth#National News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి