ఏపీ

Ap : మణిపూర్ వర్సెస్ ఏపీ..కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణ

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఏపీ, మణిపూర్ విద్యార్థినులు రెండు గ్రూపులుగా ఏర్పడి దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం స్పందించారు.హుటాహుటిన ఘర్షణ నెలకొన్న హాస్టల్‌కు పరుగులు తీసినట్టు తెలుస్తోంది.

ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఏపీ, మణిపూర్ విద్యార్థినులు రెండు గ్రూపులుగా ఏర్పడి దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం స్పందించారు.హుటాహుటిన ఘర్షణ నెలకొన్న హాస్టల్‌కు పరుగులు తీసినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే..ఏపీలోని కాకినాడ జిల్లాలో గల ఓ మహిళా నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో మొబైల్ ఫోన్ మాయమైంది. ఫోన్ పొగొట్టుకున్న విద్యార్థిని తోటి విద్యార్థినులను ప్రశ్నించగా.. చిన్న వాగ్వాదం నెలకొన్నట్టు సమాచారం.తీరా అది కాస్త తెలుగు వర్సెస్ మణిపూర్ విద్యార్థుల మధ్య గ్రూప్ వార్‌గా మారింది. విద్యార్థినుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయగా.. బకెట్లు, కర్రలు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం.

ఈ ఘటనలో ఏపీ, మణిపూర్‌కు చెందిన విద్యార్థినులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మణిపూర్ మాజీ సీఎం ఎన్.బీరేన్ సింగ్ స్పందించడంతో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నట్టు తెలిసింది. ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్టు సమాచారం. అనంతరం విద్యార్థినుల భద్రత కోసం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి ప్రత్యేక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

గొడవకు కారణమైన విద్యార్థిలను వార్డెన్ అధికారులు మందలించినట్టు సమాచారం. చిన్న గొడవ కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరేలా చేయొద్దని హితవు పలికినట్టు తెలిసింది. మొబైల్ ఫోన్ వల్ల విద్యార్థినుల మధ్య తీవ్ర ఘర్షణ అవుతుంటే ఏం చేస్తున్నారని వార్డెన్ అధికారులను జిల్లా ఉన్నతాధికారులు క్లాస్ పీకినట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

https://x.com/greatandhranews/status/2091368516528300206?s=20

#manipur#andrapradesh#students fight#girls#hostel
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి