సినిమా

Yash-Toxic: మ్యాప్‌లో ఇండియన్ సినిమా ఉండాలి..2000 కోట్లు పక్కా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Yash-Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీ సత్తాను చాటి చెప్పాడు హీరో యష్. కన్నడ రాకింగ్ స్టార్‌గా ఆయనకి ఆ తర్వాత వచ్చిన క్రేజ్ ఏపాటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. తెలుగులో ప్రభాస్, కన్నడలో యష్ అని మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చెప్పుకునేంత సక్సెస్‌ను సాధించాడు యష్. ఇప్పుడీ రాకింగ్ స్టార్ చేసిన టాక్సిక్ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కాబోతోంది.

Yash-Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీ సత్తాను చాటి చెప్పాడు హీరో యష్. కన్నడ రాకింగ్ స్టార్‌గా ఆయనకి ఆ తర్వాత వచ్చిన క్రేజ్ ఏపాటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. తెలుగులో ప్రభాస్, కన్నడలో యష్ అని మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చెప్పుకునేంత సక్సెస్‌ను సాధించాడు యష్. ఇప్పుడీ రాకింగ్ స్టార్ చేసిన టాక్సిక్ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, యష్..దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, కియారా అద్వానీ, నిత్మాత వెంకట్, టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మల్లారెడ్డి, ఆయన కోడలు తదితరులు ఈ ఈవెంట్‌లో భాగమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హీరో యష్ మాట్లాడుతూ:

మన ఇండియన్ సినిమా ప్రపంచపటంలో ఉండాలి అన్నారు. పాన్ ఇండియన్ సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమాగా చెప్పుకోవాలి అని మాట్లాడిన యష్..ఈ సినిమా కోసం కథలో ఉన్న బలాన్ని, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజన్‌ని నమ్మి ఒప్పుకున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు, ప్రతి మహిళ సమాజంలో తన సత్తాను చాటి విజయం సాధించగలదని దర్శకురాలు గీతు మోహన్‌దాస్ 'టాక్సిక్' మూవీతో నిరూపించారని తెలిపాడు.

నిర్మాత దిల్ రాజు:

పాన్ ఇండియన్ సినిమాను.. పాన్ వరల్డ్ సినిమాగా తీసుకెళ్ళేందుకు యష్ ఎంతో శ్రమించాడని దిల్ రాజు అన్నారు. అంతేకాదు, కేజీఎఫ్ సిరీస్ తర్వాత కొత్త దర్శకురాలితో సినిమా చేస్తున్న విషయం తెలిసి షాకయ్యానని అన్నాడు. కేజీఎఫ్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత పెద్ద దర్శకులకి కమిటవుతారు ఏ హీరో అయినా. అలాంటిది, యష్ మాత్రం కథ, దర్శకురాలిపై నమ్మకంతో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడని, మన ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా నిలబెట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నాడని, యష్ గురించి పొగడ్తల వర్షం కురిపించాడు దిల్ రాజు. ఇక, ఈ సినిమా గ్యారెంటీగా 2000 కోట్ల వసూళ్ళను రాబడుతుందని దిల్ రాజు ధీమాను వ్యక్తం చేశాడు.

#yash#Toxic#geethumohandas#dilraju#mallareddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి