ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.దీంతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొన్ని ఇండ్లను కూల్చాల్సి వస్తున్నది.ఈ క్రమంలోనే అధికారులు అర్ధరాత్రి ఇండ్లను కూల్చేందుకు పోలీసుల సాయంతో ఘటనా స్థలానికి వెళ్లగా ప్రజలు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏన్నో ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, పుష్కరాల కోసం తమ ఇండ్లను తొలగించడం ఏంటని అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది.
విషయం తెలుసుకున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారి సమస్యలు విన్నారు. ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. అనంతరం అధికారులతో మాట్లాడినట్టు తెలిసింది. అయినా కూడా అధికారులు ఆయన మాట వినలేదని సమాచారం. మండపేట పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన పెద్ద కాలవ గట్టు అక్రమ కట్టడాల తొలగింపును ప్రక్రియను ప్రారంభించగా వివాదం మరింత ముదిరింది.
అర్ధరాత్రి మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బందితో కలిసి అధికారులు అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం చేయగా.. ఆ సమయంలో అక్కడ నలుగురు సీఐలు వందమంది పోలీస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం.మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆదేశాల మేరకు ఇళ్లను కూల్చేందుకు రంగం సిద్దం చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అందరినీ అరెస్ట్ చేసి పోలీసులు వాహనంలో తరలించారు.
బాధితుల కోసం టిట్కో ఇల్లును మంజూరు చేశామని, అక్కడికి వెళ్లాలని సూచించినట్టు మున్సిపల్ కమిషనర్ రంగారావు వెల్లడించారు. అయితే, 12 రోజుల పుష్కరాలకోసం 60 సంవత్సరాలుగా నివాసముంటున్న తమ ఇళ్లను కూల్చి మమ్ములను రోడ్డున పడేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద,చిన్నా అని లేడా లేకుండా 15 కుటుంబాలను రోడ్డున పడేశారని బాధితులు కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా, పుష్కరాలు పేరుచెప్పి పేదలను రోడ్డు పడేస్తున్నారని, గుడిలో దీపం పేరిట పేదల ఇళ్లలో దీపాలు ఆర్పడం,రోడ్డున పడేయాలనుకోవడం సరైనది కాదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
https://x.com/RTVnewsnetwork/status/2091361283740463283?s=20


