ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దోచుకోవడం కొందరికి బాగా అలవాటు అయ్యింది. ప్రజాధనంతో కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుంటే కొందరు మాత్రం ఆటంకాలు కలిగిస్తున్నారు.దేశం పరువు తీరుస్తున్నారు. రైల్వేలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ స్లీపర్ క్లాసుల్లో దుప్పట్లు ఏర్పాటు చేస్తే కొందరు వాటిని దొంగిలించడం కామన్ అయిపోయింది.
ఈ మధ్యకాలంలో రైల్వేలో దుప్పట్ల దొంగతనం, రైల్వే శాఖ వస్తువులు దొంగతనానికి గురైన ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.వరుసగా ఫిర్యాదులు సైతం అందుతున్నట్టు తెలుస్తోంది.కొందరు ప్రయాణికులు కావాలనే చోరీలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏసీ కోచుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను దొంగిలించడం, డ్యామేజ్ చేయడం, నేరపూరిత ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలతో పాటు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ ప్రకటించినా దొంగతనాలు ఆగడం లేదు.
ఇదిలాఉండగా, తాజా ఓ ముగ్గురు వ్యక్తులు రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన దుప్పట్లను దొంగిలించారు.వాటిని శాలువాగా కప్పుకుని బయట సంచరిస్తుంటం గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అవుతోంది. వెస్టర్న్ రైల్వే అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని మార్కెట్లో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన దృశ్యాలు పలువురిని షాక్‌కు గురిచేశాయి.వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మరోసారి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకుండా,ప్రజాధనం వృథా కాకుండా సరైన బుద్ధి చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా RTI రిపోర్ట్ ప్రకారం.. 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని సమాచారం. దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు.
https://x.com/raviprakash_rtv/status/2091376793374855233?s=20


