తెలంగాణ

TG : కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతని మీద హత్యాయత్నం మీద కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి అబ్‌స్కాండ్ అయినట్టు సమాచారం.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతని మీద హత్యాయత్నం మీద కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి అబ్‌స్కాండ్ అయినట్టు సమాచారం. మంత్రి కొండా మాజీ ఓఎస్డీ కోసం వెతుకుతున్న పోలీసులు..ఇవాళ ఉదయం తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అతని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని,చంపేందుకు ప్రయత్నించాడని ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు సుమంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.తాజాగా సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు నిందితుడి కోసం విచారించనున్నట్టు సమాచారం.అసలు సుమంత్ రాష్ట్రంలోనే ఉన్నాడా? వేరే చోటుకు మకాం మార్చాడా? అన్న కోణంలో విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, సుమంత్ వ్యవహారంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా మంత్రి మీద సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సుమంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. వారం రోజుల కిందట దాడి జరగగా.. రేవంత్ మీద కొండా సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో నేడు కేసు నమోదైనట్టు సమాచారం. ఇన్ని రోజులు కేసు పైల్ చేయలేదని తెలుస్తోంది.

https://x.com/TeluguScribe/status/2091406963565629603?s=20

సుమంత్ ఓ వ్యాపారిని తన డెన్‌కు పిలిపించి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో… సుమంత్, అతని అనుచరులు ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసినట్లు గొంగిడి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మాజీ ఓఎస్డీ సుమంత్‌పై 109 సెక్షన్ కింద పోలీసులు తాజాగా కేసు నమోదు చేసినట్టు తెలిసింది.అయితే, గతంలోనూ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని డబ్బులు ఇవ్వాలని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి సుమంత్ బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుస్మిత వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

#minister konda sureka#ex osd sumanth#driver arrest#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి