సినిమా

Hero Karthi: కార్తి లైనప్‌లో ఊహించని మార్పులు!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Hero Karthi: కోలీవుడ్ హీరోలలో కార్తికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్న సూర్య తో పాటు కార్తి కూడా ప్రయోగాత్మక చిత్రాలను, కమర్షియల్ సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం, కార్తి నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం తన లైనప్‌లో మార్పు చోటు చేసుకుంది. కార్తి 30 ద్విభాషా చిత్రం ముందు రాబోతోంది.

మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ తో కార్తి సినిమా:

మ్యాడ్ సినిమాతో దర్శకుడిగా మంచి పాపులారిటీని తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తి ఒక సినిమాను చేస్తున్నాడు. ఇది కార్తి కెరీర్‌లో చేస్తున్న 30వ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. అయితే, దీనికంటే ముందు మొదలైన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయిందని, కార్తి 30 షెడ్యూల్ శరవేగంగా జరుగుతుందని తాజా సమాచారం. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీ నటిస్తోంది.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా:

మార్షన్ సినిమాను చేస్తున్నాడు కార్తి. తమిజా ఈ సినిమాకి దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కార్తి 30 తర్వాత మొదలవనుంది. 20 రోజుల టాకీ పార్ట్ కంప్లీట్ అయితే కార్తి 30 పూర్తవుతుందట. ఆ తర్వాత మార్షల్ షూట్ లో జాయిన్ కానున్నాడు కార్తి. ఈ సినిమాలో కళ్యాణి ప్రియ దర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సర్దార్ 2:

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సర్దార్ కి సీక్వె మూవీ చేస్తున్నాడు కార్తి. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. మరోసారి తండ్రీకొడులుగా కార్తి అలరించబోతున్నాడు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ డాగర్ గా విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు. ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్, రజీష విజయన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సర్దార్ 2 తర్వాత 2027, సంక్రాంతికి కార్తి 30, ఆ తర్వాత మార్షల్ రానున్నాయి. వాస్తవానికి ఈ లైనప్‌లో ముందు రావాల్సిన మార్షల్. కానీ, ఇది పీరియాడికల్ సినిమా కాబట్టి షూటింగ్ కోసం ఎక్కువ సమయం పడుతోంది.

#karthi#karthi30#sardhar 2#marshall#ps mithran
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి