వైరల్ న్యూస్

Software Layoffs: 'వయసు తక్కువ' అనే సాకు.. సాఫ్ట్‌వేర్ రంగంలో లేఆఫ్స్ కలకలం!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీని ప్రముఖ దిగ్గజ సంస్థ 'మైక్రోసాఫ్ట్' విధుల్లో నుంచి తొలగించడం ఐటీ సర్కిళ్లలో చర్చనీయాంశమైంది. తాను వయసులో చిన్నవాడినని, కుటుంబ బాధ్యతలు తక్కువగా ఉంటాయనే విచిత్రమైన సాకుతో తనను ఉద్యోగం నుంచి తీసేసినట్లు సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'రెడ్డిట్' ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రస్తుతం ఆయన కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు.

సుమారు మూడేళ్ల అనుభవం ఉన్న ఆ యువకుడు తన పోస్ట్‌లో కుటుంబ పరిస్థితుల గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారమని, వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, చెల్లెలి చదువుతో పాటు తండ్రి చేసిన అప్పులను తీర్చే బాధ్యత అంతా తన భుజాలపైనే ఉందని పేర్కొన్నారు. అయితే, లేఆఫ్ సమయంలో మేనేజర్ కేవలం ఊరడించడానికి ఆ కారణం చెప్పి ఉండవచ్చని, అసలు కారణం వేరే అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ భారాన్ని మోస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా కుంగదీసిందని వాపోయారు.

మరోవైపు, అమెరికాకు చెందిన మరో ప్రముఖ ఐటీ దిగ్గజం 'ఒరాకిల్' సంస్థ భారత్‌లో భారీస్థాయిలో ఉద్యోగ కోట్లకు తెరలేపింది. దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 12వేల మంది ఉద్యోగులపై సంస్థ వేటు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ లేఆఫ్స్ సంఖ్య ఏకంగా 30వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంస్థాగత మార్పులు, వ్యాపార కార్యకలాపాల క్రమబద్ధీకరణ నేపథ్యంలోనే ఈ కోతలు తప్పలేదని ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిళ్లలో ఒరాకిల్ యాజమాన్యం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగాల నుంచి తొలగించిన టెక్కీల కోసం సంస్థ ఒక ప్రత్యేక సెవరేజ్ ప్యాకేజీని ప్రకటించింది. నిబంధనల ప్రకారం నోటీసు కాలానికి సంబంధించిన వేతనంతో పాటు, స్వచ్ఛందంగా తప్పుకునేవారికి మరికొన్ని అదనపు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని ఆ ఈమెయిల్‌లో వెల్లడించింది. అయితే, ఈ భారీ లేఆఫ్స్‌పై అధికారికంగా స్పందించేందుకు మాత్రం ఒరాకిల్ సంస్థ నిరాకరించింది. ఏదేమైనప్పటికీ, వరుసగా వస్తున్న ఈ లేఆఫ్ వార్తలు ఐటీ నిపుణులను, ఉద్యోగార్థులను నిత్యం ఆందోళనకు గురిచేస్తున్నాయి.

#Microsoft Layoffs Techie Reddit#Oracle Mass Layoffs India 2026#IT Sector Job Cuts Hyderabad#Software Engineer Job Loss Reasons#Tech News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి