వైరల్ న్యూస్

TG : నేను చేసింది తప్పే.. భార్య ఉండగా అలా చేయాల్సింది కాదు : ఈశ్వర్ సాయి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తెలంగాణ జానపద నటులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘బాసింగ బలాలు’ సాంగ్‌తో వీరికి మంచి క్రేజ్ వచ్చింది. అలా జరిగిన కొన్ని రోజుల్లోనే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ కలిసి ఒకే రూంలో అర్ధనగ్నంగా దొరకడంతో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే, తాజాగా వ్యవహారంపై ఈశ్వర్ సాయి స్పందించాడు.ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. ఒత్తిడి కారణాల దృష్ట్యా హోటల్‌లో అలా చేయాల్సి వచ్చిందని, భార్య ఉండగా తాను అలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని అంగీకరించాడు. మాధురి రాథోడ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తర్వాత తనది తప్పని ఈశ్వర్ సాయి ఒప్పుకోవడంతో నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మాధురికి సపోర్టు చేస్తుంటే మరికొందరు ఇద్దరిదీ తప్పని తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

ఇదిలాఉండగా, తన మీద అకారణంగా దాడి చేశారని, పరువు తీశారని మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్యకరంగా దూషించడంతో పాటు దాడి చేసిందని, తన ఫోన్ దొంగిలించి అందులోని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిందని మాధురి నిన్న వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత జీవితానికి, పరువుకు భంగం కలిగించేలా వ్యవహారించిన వారిపై , సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను కోరింది.

కాగా, ఈనెల 19న వేములవాడలోని ఓ రూంలో ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ ఏకాంతంగా ఉన్న సమయంలో సాయి భార్య రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకుని నానా రభస చేసి విషయం తెలిసిందే. మాధురిపై ఈశ్వర్ సాయి దాడి చేస్తున్న దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://x.com/TeluguScribe/status/2091427776196943993?s=20

#folk songs actor#Eshwar sai#maduri rathod#affair#casefile
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి