క్రైమ్

గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాములు దగ్ధం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్ కానాల ప్రాంతంలో ఉన్న పలు ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాముల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్ కానాల ప్రాంతంలో ఉన్న పలు ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాముల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాముల నిండా భారీ మొత్తంలో చెక్క సామగ్రి, ప్లైవుడ్ బోర్డులు, అలాగే డైపర్లు వంటి ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడిన దట్టమైన నల్లటి పొగలతో ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం సంతరించుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అత్యవసరంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదు ఫైర్‌ ఇంజిన్లను ఘటనాస్థలానికి రప్పించి, సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఉదయం సుమారు 11గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ మీడియాకు వెల్లడించారు. మొత్తం ఆరు గోదాములు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఐదు గోదాముల్లో ప్లైవుడ్ సామగ్రి ఉండగా, మరొకటి డైపర్లు తదితర వస్తువుల నిల్వ కేంద్రమని తేలింది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించారు. దీనివల్ల పెద్దఎత్తున జరగాల్సిన పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మంటలు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలు లేదా ఇతర వాణిజ్య సముదాయాలకు పాకకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అంజులోకి వచ్చింది.

ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి నష్టపోయిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

 

#Hyderabad Gudimalkapur Fire Accident#Furniture Warehouses Burnt Hyderabad#Moghal Kanala Fire Mishap#Fire Engine Operations Hyderabad#Telangana News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి