Naga Chaithanya: టాలీవుడ్‌లో మిగతా హీరోల కంటే అక్కినేని నాగ చైతన్య కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తినాల్సిన దక్కాముక్కీలన్నీ కెరీర్ ప్రారంభంలోనే తిన్నాడు. చూడాల్సిన ఫ్లాపులను ముందుగానే చూసేశాడు. ఒకదశలో అసలు కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వకూడదని కూడా చైతూ భావించాడు. రెండు బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడితోనే సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉంటున్నాడు తప్ప, కంప్లీట్ డెబ్యూ డైరెక్టర్‌తో మాత్రం కాదు.
నాగ చైతన్యకి మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ.. తాజాగా వచ్చి హిట్ కొట్టిన ఇరుముడి కథను ముందు చైతూకే వినిపించాడట. కథ, బాగా నచ్చినప్పటికీ..ప్రస్తుతం కమిటైన వృష కర్మ చిత్రానికి ఎక్కువగా డేట్స్ ఇచ్చి ఉండటంతో, ఇరుముడి చిత్రానికి సర్దుబాటు చేయలేకపోయాడట. దీంతో, ఇరుముడి కథను వదులుకోవాల్సి వచ్చిందట. అయితే, ఇది మంచికే అంటున్నారు.
అక్కినేని అభిమానులు ఇరుముడి సినిమా చూశాక, 10 ఏళ్ళ పాపకి తండ్రిగా అంటే చైతూ అస్సలు సూటయ్యేవాడు కాదని అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. రవితేజకి సూటైనట్టుగా త్రినాథ్ పాత్ర చైతూకి సూటయ్యేది కాదట. 39 ఏళ్ళ చైతూ 10 ఏళ్ళ పాపకి తండ్రిగా నటిస్తే జనాలు ఒప్పుకునేవారు కాదని ఇప్పుడు అంటున్నారు.
రవి తేజ వయసుకు తగ్గ పాత్ర అని, తాగుబోతు పాత్రలో నటించడం కొత్త కాకపోయినా, రిస్క్ అంతా మిగతా కథ, 10 ఏళ్ళ పాపకి తండ్రిగా అంటే సినిమా హిట్ అయ్యేది కాదంటున్నారు. రవితేజకి పరెఫెక్ట్‌గా సూటైంది కాబట్టే రెండు రోజుల్లోనే బ్రేకీవెన్ అయిందని, ఒకవేళ ఈ సినిమా గనక చైతూ చేసి ఉంటే హిట్ అయ్యేది కాదని నిర్మొహమాటంగా చెప్తున్నారట. ఈ మాటలో వాస్తవమే ఉంది. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది.


