‘జనవరి 12 విడుదల’: ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ చిత్రాలలో వచ్చి భారీ హిట్ సాధించిన మల్టీస్టారర్ సినిమాలంటే ఎక్కువగా అనిల్ రావిపూడి తీసిన సినిమాలే గుర్తొస్తాయి. వెంకటేష్-వరుణ్ తేజ్-తమన్నా, మెహ్రీన్‌లతో ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలను తీసి బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలో మెగాస్టార్-విక్టరీ వెంకటేష్‌లను డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘జనవరి 12 విడుదల’ అనే చిత్రం తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. షైన్ స్క్రీన్ బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సాహు గారపాటి, సురేష్ బాబు నిర్మాతలు. హీరోయిన్‌గా కీర్తి సురేష్, కృతీ శెట్టి నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకి సంబందించి ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్, కీర్తి సురేష్, కృతీశెట్టిలపై ఓ స్పెషల్ సాంగ్‌ను అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడట. దీని కోసం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో భారీ సెట్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ సెట్‌లోనే హీరోహీరోయిన్స్‌పై సాంగ్ షూట్ చేయనున్నారట. ఎఫ్ 2, ఎఫ్ 3 లోనూ ఇలాగే హీరోలు, హీరోయిన్స్ మీద సాంగ్ తీసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు.
ఆ తరహాలోనే ఇప్పుడు కూడా ‘జనవరి 12 విడుదల’ మూవీలో నలుగురుపై స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్‌కి ఆడియన్స్ థియేటర్స్‌లో ఈలలేసి గోల చేయడం పక్కా అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక, ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకూ 9 బ్లాక్ బస్టర్స్ తీసిన అనిల్ రావిపూడి, ఇప్పుడు చేస్తున్న ఈ మల్టీస్టారర్‌తో 10వ హిట్ కొట్టడం గ్యారెంటీ అని నమ్మకంగా ఉన్నారు. ‘జనవరి 12 విడుదల’ టైటిల్ వెరైటీగా ఉందనుకుంటే బావా బామ్మర్ది సౌజన్యంతో అనే క్యాప్షన్ ఇంకా వెరైటీగా ఉంది.


