క్రీడలు

లంకతో రెండో టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. కొత్త ఆల్‌రౌండర్‌ అరంగేట్రం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో 165పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో 165పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌తో మధ్యప్రదేశ్‌కు చెందిన యువ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ సరాన్ష్ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చేతుల మీదుగా అతడు తన డెబ్యూ క్యాప్‌ను అందుకున్నాడు. తుది జట్టులో స్వల్ప మార్పులు చేసినట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపారు. ఇన్ఫెక్షన్ కారణంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చినట్లు వెల్లడించారు. గాలె పిచ్‌తో పోలిస్తే కొలంబో పిచ్ మరింత పటిష్టంగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, తొలి రెండు మూడు రోజులు బ్యాటింగ్‌కు ఇబ్బంది ఉండదని గిల్ ధీమా వ్యక్తం చేశారు. ఇక తొలి టెస్టు విజయంపై స్పందిస్తూ, తమ ప్రదర్శనకు 9 రేటింగ్ ఇస్తానని, టెస్ట్ క్రికెట్‌లో పరిపూర్ణ ఆట కనబరచడం కష్టమైనా తాము అత్యుత్తమంగా రాణించామని పేర్కొన్నాడు.

మరోవైపు, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ వాతావరణం మేఘావృతమై ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయడానికే మొగ్గుచూపినట్లు శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా తెలిపాడు. తొలి సెషన్‌లోనే వికెట్లు తీసి భారత జట్టుపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా లంక జట్టులో కమిల్ మిషారా, పసిందు సూరియబండార ఇద్దరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు.

తుది జట్లు:

  • భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సరాన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

  • శ్రీలంక: లహిరు ఉడార, కమిల్ మిషారా, పసిందు సూరియబండార, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), సోనాల్ దినూష, నిరోషన్ డిక్‌వెల్లా (వికెట్ కీపర్), కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో.

 

#India Vs Sri Lanka 2nd Test 2026#Saransh Jain Debut#Shubman Gill Toss Batting#Colombo Test Match Squads#Cricket News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి