తెలంగాణ

TG : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నిన్న రాత్రి ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నిన్న రాత్రి ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.

దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని కూకట్ పల్లి, బాలానగర్,అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సెక్రేటేరియట్, రాంనగర్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు తెలిసింది. నిన్న శనివారం కావడంతో ఐటీ ఉద్యోగులకు సెలవు ఉన్నందున ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తీరినట్టు ప్రయాణికులు తెలిపారు.

అయితే, అల్పపీడనం ప్ర‌భావం కారణంగా నేడు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఉత్త‌ర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, జ‌గిత్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, భద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నిర్మ‌ల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు.

ప‌శ్చిమ, మ‌ధ్య తెలంగాణ జిల్లాలు, ఇత‌ర ప్రాంతాల్లోనూ మోస్త‌రు నుండి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని హెచ్చరించారు. ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచనా వేశారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ముందస్తు హెచ్చరికలు చేశారు.ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే రోజంతా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, సాయంకాలం లేదా రాత్రి సమయంలో మోస్త‌రు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని వెల్లడించారు.

#heavy rains#telangana#districts#whether man balaji#prediction
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి