సినిమా

Allu Arjun: కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే..చిరుకి బర్త్ డే విషెస్..వైరల్‌గా పోస్ట్

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Allu Arjun: నేడు(ఆగస్టు 22) టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి మెగా ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు, చిరుతో ఉన్న ప్రత్యేకమైన జర్నీ, అనుబంధాన్ని గురించి ప్రత్యేకంగా పంచుకున్నారు. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిరుకి బర్త్ డే విషెస్ చెప్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ మొట్టమొదట కనిపించిన సినిమా డాడీ. ఈ సినిమాలో ఒక సాంగ్‌లో కనిపిస్తాడు. డాన్స్ ప్రాక్టీస్ చేసే కుర్రాడిలా కనిపించిన బన్నీకి చిరు వచ్చి స్టెప్ చూపిస్తాడు. అలా, మొదటి సినిమాను చిరుతో చేసిన అల్లు అర్జున్..ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా మారాడు. ఇక, స్టైలిష్ స్టార్‌గా క్రేజ్ తెచ్చిన సినిమా ఆర్య. అయితే, అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో వెన్నుదన్నుగా ఉంది మెగాస్టారే.

అల్లు అరవింద్ నిర్మాత అయినా, మెగాస్టార్ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ వచ్చింది. ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న అల్లు అర్జున్.."మాకు ఆయనే అతిపెద్ద పిల్లర్" అని రాసుకొచ్చాడు. "మమ్మలిని ఎంతో ఇన్‌స్పైర్ చేసి మా ఎదుగుదలకు బాటలు వేసిన చిరుకి ఎల్లప్పటికీ అభిమానిగా ఉండిపోతానంటూ".. ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు.

అంతేకాదు, ఈ సందర్భంగా బన్నీ KKAVCF(కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే) అంటూ మరోసారి చిరుపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు బన్నీ చేసిన ఈ పోస్ట్‌ను అటు అల్లు ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ తెగ షేర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఇంతకముందు, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా పాపులర్ అయ్యాక..అసలు చిరును లెక్కచేయనట్టుగా ప్రవర్తించాడు..అంటూ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీన్ని, బన్నీ గానీ, చిరు గానీ ఖండించలేదు. ఇప్పుడు, మాత్రం మెనమామ మీద ప్రేమాభిమానాలను చూపించడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది..

#allu arjun#chiranjeevi#megastar#iconstar#bunny#megafamily
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి