తెలంగాణ

Hyd : నాపై అత్యాచారం చేశాడు.. ఏలూరు యువకుడిపై యువతి ఫిర్యాదు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ప్రేమ,పెళ్లి పేరిట ఇటీవలి కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. పెళ్లికి ముందే కొందరు యువతీయువకులు లైంగికంగా ఒక్కటవుతున్నారు. ఫలితంగా అనతి కాలంలోనే రిలేషన్ షిప్ బ్రేక్ అవుతోంది. పెళ్లిచేసుకోవాలని అడుగటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వెలుగుచూస్తున్న చాలా కేసుల్లో ఇటువంటి కేసులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

ప్రేమ,పెళ్లి పేరిట ఇటీవలి కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. పెళ్లికి ముందే కొందరు యువతీయువకులు లైంగికంగా ఒక్కటవుతున్నారు. ఫలితంగా అనతి కాలంలోనే రిలేషన్ షిప్ బ్రేక్ అవుతోంది. పెళ్లిచేసుకోవాలని అడుగటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వెలుగుచూస్తున్న చాలా కేసుల్లో ఇటువంటి కేసులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

పెళ్లి పేరిట అమ్మాయిలను శారీరకంగా వాడుకుని కొందరు అబ్బాయిలు మోహం చాటేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి.మరికొన్ని ఘటనలో అమ్మాయిలు సైతం ప్రేమపెళ్లి పేరిట అబ్బాయిలను ఫైనాన్సియల్‌గా వాడుకుని వదిలేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

అనంతరం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, మోసపోయానని అమ్మాయి లేదా అబ్బాయి కేసులు పెట్టడం జరుగుతోంది. చాలా కేసుల్లో అమ్మాయిలే మోసపోయామని.. అబ్బాయిలపై అత్యాచారం కేసు ఫైల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది.

ఏపీకి చెందిన యువకుడిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేయడంతో పాటు అశ్లీల వీడియాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకివెళితే.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన పాస్టర్ మల్లిపూడి సువర్ణ రాజు కుమారుడిపై ఓ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బ్లాక్ మెయిల్ కేసు కూడా పెట్టింది.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి తండ్రి మల్లిపూడి సువర్ణ రాజును గచ్చిబౌలి పోలీసులు ఆయన స్వగ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.కాగా,ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

#rape case#hyderabad#gacchibowli ps#eluru person#andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి