National

TN : ఎమ్మెల్యేలకు కార్లపై వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. కారణం ఇదేనా?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తమిళనాడు సీఎం విజయ్‌ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు అందరికీ కొత్త వాహనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

తమిళనాడు సీఎం విజయ్‌ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు అందరికీ కొత్త వాహనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఇదివరకు ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వారికి సైతం లగ్జరీ కార్లు ఇస్తామని సీఎం ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో టీవీకే చీఫ్, సీఎం విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది.ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అందులో టీవీకే పార్టీ నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన వారు చాలా మందే ఉన్నారు. వారితో పాటే డీఎంకే, ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నికలైన వారు కూడా ఉన్నారు.వీరికి నూతన వాహనంతో పాటు ఫ్యూయల్,మెయింటెన్స్ కోసం నెలకు రూ.1 లక్ష అలవెన్స్ ఇస్తామని ముందుగా సీఎం విజయ్ ప్రకటన చేశారు.

దీంతో ఆనందం ఉప్పొంగిన ఓ ఎమ్మెల్యే పాట కూడా పాడారు.అయితే, రాష్ట్రం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంటే ప్రజల సొమ్ముతో ఎమ్మెల్యేలకు లగ్జరీ కార్లు ఇవ్వడం సబబు కాదని, తమ ఎమ్మెల్యేలకు కార్లు వద్దని ప్రతిపక్ష డీఎంకే తేల్చిచెప్పింది. దీంతో విజయ్ ప్రభుత్వం ఇప్పటికే సొంత కార్లు ఉన్న వారికి కార్లు ఇవ్వబోమని, కేవలం కార్లు లేని ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేస్తామని మరోసారి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇదిలాఉండగా, తమిళనాడులో దాదాపు 90% మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేలకు సొంతంగా లగ్జరీ వాహనాలు ఉన్నట్టు తెలిసింది.

https://x.com/Telugu360/status/2090982117824164011?s=20

సీఎం తాజాగా ప్రకటనతో లగ్జరీ కార్లు కొనాలని భావించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పార్టీ చీఫ్ ప్రకటన వలన కార్లు రాకుండా పోయాయని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు సైతం లోలోపల చర్చించుకున్నట్టు సమాచారం. కాగా, కార్లు ఎమ్మెల్యేలకు కొత్తగా ఇవ్వాలని సీఎం విజయ్ నిర్ణయంతో కేవలం పది,ఇరవై మాత్రమే తమిళనాడు సర్కార్ కొనుగోలు చేయనుంది.

#tamilnadu#cm vijay#new cars#mla's. dmk#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి