తెలంగాణ

Vivek Venkataswamy: వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది- మంత్రి వివేక్ షాకింగ్ కామెంట్స్

రచన: NK••6 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల తీసుకొచ్చిన జీవో 97 తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Vivek Venkataswamy: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల తీసుకొచ్చిన జీవో 97 తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది.

నా గ్యారెంటీతో మీకేం ఫాయిదా?

ఇదే అంశంపై పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడే క్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది.. అందుకే నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను అని పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. అటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.

సొంత ప్రభుత్వంపై నమ్మకం లేదా?

స్కిల్ యూనివర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు బ్యాక అవుట్ అవ్వరని గ్యారెంటీ ఇవ్వాలని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మంత్రి వివేక్ ఈ విధంగా బదులిచ్చారు. రేపు నేను ఓడిపోతానేమో, మా ప్రభుత్వం దిగిపోతుందేమో, నా గ్యారెంటీతో మీకేం ఫాయిదా? అంటూ ఆయన చెప్పడం విద్యార్థులను ఒకింత విస్మయానికి గురి చేసింది. మంత్రి వివేక్ కామెంట్స్ అనేక అనుమానాలకు దారితీశాయి. ప్రభుత్వంపై మంత్రికే నమ్మకం లేకపోతే ఎలా? ఇక ప్రజలకు, పెట్టుబడిదారులకు ఏం భరోసా ఇస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి మాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయే అవకాశం ఉందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మంత్రి వివేక్ వ్యాఖ్యలు ఇప్పుడు ఎటువంటి అనర్థాలకు దారితీస్తాయో అని పార్టీ పెద్దలు కంగారు పడుతున్నారు.

ముఖ్యమంత్రి అలా.. మంత్రి ఇలా..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదు, మరోసారి వచ్చేది కాంగ్రెస్ సర్కారే, పదేళ్లు అధికారంలో ఉంటాము అని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, ప్రజా పాలన అందిస్తున్నామని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ అంతా విశ్వాసంగా చెబుతుంటే.. మరోవైపు మంత్రి వివేక్ మాత్రం.. మా ప్రభుత్వం దిగిపోతుంది అంటూ అనడం కాంగ్రెస్ వర్గాల్లో రచ్చకు దారితీసింది. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.

మాసబ్ ట్యాంక్ లో పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన..విద్యార్థుల అన్ని డిమాండ్లను ఒప్పుకున్నామని తెలిపారు. అవసరమైతే అన్ని విషయాలను జీవోలో పొందుపరిచి కొత్త జీవో ఇస్తామన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న సిస్టమ్ అలానే ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలు శక్తి పథకం పరిధిలోకి వస్తే విద్యార్థులకు నష్టం లేదని వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటుపరం చేయము అని హామీ ఇచ్చారు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి వివేక్ మండిపడ్డారు బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ధ్వజమెత్తారు. సంస్కరణలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#Vivek Venkataswamy#Polytechnic College#Polytechnic Students#Shakti scheme#Cm Revanth Reddy#Telangana Govt#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి