Yash-Toxic: ఒక కన్నడ స్టార్ హీరో సినిమాకి తెలుగులో అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకునే వీలుంటుందా? అనే అమాట ఇటీవల బాగా వినిపించింది. ఇప్పుడు అదే మాట నిజమైంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి ఏపీ, తెలంగాణాలలో టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే, షోస్ కూడా అదనంగా ప్రదర్శించుకునేలా జీవోను పాస్ చేశారు. నైజాంలో సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 100 రూపాయలు అదనంగా, అలాగే 5 షోలకి అనుమతినిచ్చారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ సినిమా ఆగస్టు 26న రిలీజ్ అవుతోంది. అయితే, ఇప్పటి వరకూ బుక్ మై షోలో టికెట్స్ కొనడానికి ఓపెన్ కాలేదు. దీనికి, కారణం ఇక్కడ అదనపు షోలకి, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు లభించకనే అని అర్థమైంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ తాజాగా దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.
ఇప్పుడు, బుక్ మై షో ఓపెన్ అయింది. నైజాంలో టాక్సిక్ చిత్రానికి టికెట్ ధరలకి హైక్ ఇస్తూ అధికారిక జీవోను రిలీజ్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో 100 రూపాయల అదనపు పెంపుతో ‘టాక్సిక్’ మూవీని రోజు 5 షోస్ చొప్పున అనుమతిని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. యష్ కి కన్నడలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.

ఈ కారణంగానే ఈ సినిమాకి హైక్ ఇవ్వక తప్పలేదు. కానీ, ఓ కండీషన్ కూడా ఉంది. ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 4 వ తేదీ వరరకు అంటే మొత్తం 10 రోజులు పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక, ఇదే జీవోలో నిర్మాణ సంస్థలు కే వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్ ఇద్దరూ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీ వెల్ఫేర్ కమిటీకి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ఆదేశిస్తూ.. ఈ జీవోను విడుదల చేశారు.


