తెలంగాణ

Cm Revanth: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్.. భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

రచన: NK••3 నిమిషాల పఠనం

Cm Revanth: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం. ఈ ప్రాజెక్ట్ ను వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ MCRHRD బోధి పెవిలియన్ లో పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పురోగతిపై ఆరా తీశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతం చేసేలా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Cm Revanth: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం. ఈ ప్రాజెక్ట్ ను వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ MCRHRD బోధి పెవిలియన్ లో పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పురోగతిపై ఆరా తీశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతం చేసేలా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్, హెచ్ ఎండీఏ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు.

మూసీ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులతో సీఎం రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలన్నారు. టీడీఆర్ పై ప్రతి వారం సమీక్ష జరగాలన్నారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలన్నారు. కొత్వాల్ గూడ బర్డ్స్ పార్క్ కు మరింత ప్రచారం కల్పించాలని అధికారులతో సీఎం రేవంత్ చెప్పారు.

#Cm Revanth Reddy#Musi#Musi River Front#Musi River Rejuvenation#Musi Riverfront Development Project#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి