సినిమా

The Paradise: ప్యారడైజ్ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్

రచన: Anshu••4 నిమిషాల పఠనం

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. ఇక, మొదటి పాట ఆయా షేర్ ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్..రెండవ పాటను కూడా రాశాడు. ఆ సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తైంది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు శ్రీకాంత్ పిక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

జంగి రెడ్డి పాడిన ఆయా షేర్ సాంగ్‌తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దసరా తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై అందరిలోనూ అంచనాలు బాగా పెరిగాయి. మొత్తం 8 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే, నానీ గెటప్ మీద పాజిటివ్ టాక్ ఎలా ఉందో, నెగిటివ్ కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి.

మరి, సినిమా రిలీజైయ్యాక అంచనాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇటీవల వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచాయి. అయితే, ఫిల్మ్ సర్కిల్స్‌లో ఈ సినిమాపై కొంత డివైడ్ టాక్ కూడా వినిపిస్తోంది. అనుకున్నదానికంటే బడ్జెట్ చాలా పెరిగిందని, ఇంకా 20 కోట్ల వరకూ బిజినెస్ లాస్‌లోనే ఉందని చెప్పుకుంటున్నారు. సినిమా మేకింగ్ కోసం చాలా సమయం పట్టింది. పైగా, నాని గెటప్ కాస్త మైనస్ అయ్యేలా ఉంది.

మరి, 'ది ప్యారడైజ్' సినిమాతో చేస్తున్న ప్రయోగం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇక, ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. మొదటి సాంగ్ ఎంత హిట్ అయిందో ఇప్పుడు కాసర్ల రాసిన రెండవ సాంగ్ కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు. తాజాగా, దీనికి సంబందించిన అప్‌డేట్ ను దర్శకుడు పంచుకున్నాడు. చూడాలి, మరి భారీ అంచనాలతో రాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.

#the paradaise#nani#srikanth odela#kayadu lohar#keerthy suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి